హిమ్మత్‌నగర్: గుజరాత్‌లో హెచ్‌ఎంపీవీ కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య మూడుకు చేరింది. సబర్‌కాంత జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలుడికి హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా నిర్థారణైందని శుక్రవారం అధికారులు తెలిపారు.
ప్రాంతిజ్ తాలూకాలో కార్మికుడి కుటుంబానికి చెందిన బాలుడికి పరీక్ష చేయించారని, అతడి నుంచి మరోసారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించామన్నారు. హిమ్మత్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ రతన్‌కన్వర్ చెప్పారు. గుజరాత్‌లో మొదటి కేసు ఈ నెల 6న, రెండో కేసు రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment