
పోలీస్ శాఖలో 18 వేల పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో 18,290 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ సెక్రటరీ శివశంకర్ జీవో జారీ చేశారని డీజీపీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్ విభాగంలో 9,629 పోస్టులు, ఏఆర్ విభాగంలో 5,738, బెటాలియన్స్‌లో 2,075, కమ్యూనికేషన్ విభాగంలో 143, మినిస్టీరియల్ కింద 599 పోస్టులతోపాటు ఇతర విభాగాల్లో 106 పోస్టులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
భారీగా పదోన్నతులు..
రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 29 మంది మినిస్టీరియల్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 10 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా, 19మం ది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు.