క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం: ఏపీ హోంమంత్రి | ap home minister warn on cricet betting | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం: చినరాజప్ప

Dec 13 2017 12:56 PM | Updated on Aug 28 2018 8:41 PM

ap home minister warn on cricet betting - Sakshi

సాక్షి, విజయవాడ : క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో బుధవారం ఆయన నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర‍్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, కుల,వర్గ విభేదాలను అదుపు చేయగలిగామన్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కళాశాలల యాజమాన్యాలతో చర్చిస్తామన‍్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. మహిళలపై దాడులకు పాల్పడేతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చినరాజప్ప హెచ‍్చరించారు. ఎవరైనా సరే రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రంలో సరిపడనంత మంది పోలీసులు లేకపోయినా నేరాలను నియంత్రించడంలో వారు చేస్తున‍్న కృషి ప్రశంసనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement