సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అమలులోకి తీసుకువచ్చిన పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురావాలని డీజీపీ జాస్తి వెంకట రాముడు నిర్ణయించారు. దీనికి సంబంధించిన తొలి సమావేశం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఇందులో అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు. వాటిని నియామక బోర్డ్ అధికారులు మంగళవారం డీజీపీ రాముడి దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
ప్రధానాంశాలివి...
- రిక్రూట్‌మెంట్‌లో స్క్రీనింగ్ పరీక్షగా ఉన్న 5 కిమీ పరుగును వివిధ ఇబ్బందులతో పూర్తిగా తొలగించాలని సిఫార్సు చేశారు.
- ఇకపై జరిగే పోలీసు రిక్రూట్‌మెంట్స్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసేందుకు వెసులు బాటు.
- 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్ వంటి పరీక్షల్లోనూ పలు మార్పులు చేయనున్నారు.
- టెక్నికల్ విభాగాలుగా పిలిచే పోలీసు కమ్యూనికేషన్స్, రవాణా విభాగం, వేలి ముద్రల విభాగాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణ, ఆర్డ్మ్ రిజర్వ్ విభాగాల ఎంపిక ప్రక్రియలకు పూర్తి భిన్నంగా డిజైన్ చేస్తున్నారు.
- కానిస్టేబుల్ ఎంపిక విధానానికి భిన్నంగా ఎస్సై రిక్రూట్‌మెంట్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్ని అమలు చేయాలని కొందరు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు.
పోలీసు ఎంపికలో సమూల మార్పులు
Published Tue, May 26 2015 2:52 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement