venkata ramudu
-
పరిటాల శ్రీరామ్.. మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?
సాక్షి, కనగానపల్లి (అనంతపురం): తగరకుంట సర్పంచ్‌గా పనిచేసిన మా తండ్రి బోయ ముత్యాలప్పను రాజకీయ ఆధిపథ్యం కోసం మీ నాన్న పరిటాల రవీంద్ర హత్య చేయించింది నిజం కాదా ? అని ముత్యాలప్ప కుమారుడు వెంకటరాముడు పరిటాల శ్రీరామ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఆయన కనగానపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ వాల్మీకులపై ప్రేమ ఒలకబోసినట్లు శ్రీరామ్ కట్టు కథలు చెపుతున్నాడన్నారు. మీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ఐక్యంగా ఉన్న వాల్మీకులను విడగొట్టింది పరిటాల కుటుంబమే అన్నారు. కనగానపల్లి, రామగిరి మండలాల్లో ప్రతి గ్రామంలోనూ వాల్మీకుల మధ్య చిచ్చు పెట్టి వాళ్లు చంపుకొనేవరకు తీసుకొచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 2007 తర్వాతా రాజకీయాల్లోకి వచ్చిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన సేవాభావంతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించటంతో పాటు మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాతా నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులు చేయించటంతో పాటు పేరూరు డ్యాంకు కృష్ణ జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు ప్రకాష్‌రెడ్డి అన్నారు. పేద ప్రజల కష్టాన్ని తీరుస్తున్న తోపుదుర్తి కుటుంబంపై అనవసరమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని ఆయన పరిటాల శ్రీరామ్‌కు, టీడీపీ నాయకులకు సూచించారు. చదవండి: (‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’) -
పోలీసు ఎంపికలో సమూల మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అమలులోకి తీసుకువచ్చిన పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురావాలని డీజీపీ జాస్తి వెంకట రాముడు నిర్ణయించారు. దీనికి సంబంధించిన తొలి సమావేశం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఇందులో అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు. వాటిని నియామక బోర్డ్ అధికారులు మంగళవారం డీజీపీ రాముడి దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రధానాంశాలివి... - రిక్రూట్మెంట్లో స్క్రీనింగ్ పరీక్షగా ఉన్న 5 కిమీ పరుగును వివిధ ఇబ్బందులతో పూర్తిగా తొలగించాలని సిఫార్సు చేశారు. - ఇకపై జరిగే పోలీసు రిక్రూట్మెంట్స్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసేందుకు వెసులు బాటు. - 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్ వంటి పరీక్షల్లోనూ పలు మార్పులు చేయనున్నారు. - టెక్నికల్ విభాగాలుగా పిలిచే పోలీసు కమ్యూనికేషన్స్, రవాణా విభాగం, వేలి ముద్రల విభాగాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణ, ఆర్డ్మ్ రిజర్వ్ విభాగాల ఎంపిక ప్రక్రియలకు పూర్తి భిన్నంగా డిజైన్ చేస్తున్నారు. - కానిస్టేబుల్ ఎంపిక విధానానికి భిన్నంగా ఎస్సై రిక్రూట్మెంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్ని అమలు చేయాలని కొందరు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. -
పెండింగ్‌లో 13 ‘సమైక్య కేసులు’
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో నమోదైన కేసుల తొలగింపుపై పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. 257 కేసుల ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోవాలని సమీక్ష కమిటీ ప్రభుత్వానికి గురువారం నివేదించింది. దాదాపు 1,900 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్నింటికి ప్రభుత్వం అప్పట్లోనే ఎత్తివేసింది. ఏపీ డీజీపీగా వెంకటరాముడు బాధ్యతలు చేపట్టే నాటికి 847 కేసులు మిగిలాయి. అన్ని కేసులను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచిన నేపథ్యంలో పోలీసు విభాగం కసరత్తు చేపట్టింది. 13 కేసులు తీవ్రమైన ఆరోపణలతోపాటు రైల్వేలు లాంటి కేంద్రం ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం లాంటి కేసులున్నట్లు కమిటీ గుర్తించింది. వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పింది.