సాక్షి, కనగానపల్లి (అనంతపురం): తగరకుంట సర్పంచ్‌గా పనిచేసిన మా తండ్రి బోయ ముత్యాలప్పను రాజకీయ ఆధిపథ్యం కోసం మీ నాన్న పరిటాల రవీంద్ర హత్య చేయించింది నిజం కాదా ? అని ముత్యాలప్ప కుమారుడు వెంకటరాముడు పరిటాల శ్రీరామ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఆయన కనగానపల్లిలో విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ వాల్మీకులపై ప్రేమ ఒలకబోసినట్లు శ్రీరామ్ కట్టు కథలు చెపుతున్నాడన్నారు. మీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ఐక్యంగా ఉన్న వాల్మీకులను విడగొట్టింది పరిటాల కుటుంబమే అన్నారు. కనగానపల్లి, రామగిరి మండలాల్లో ప్రతి గ్రామంలోనూ వాల్మీకుల మధ్య చిచ్చు పెట్టి వాళ్లు చంపుకొనేవరకు తీసుకొచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు.
2007 తర్వాతా రాజకీయాల్లోకి వచ్చిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన సేవాభావంతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించటంతో పాటు మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాతా నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులు చేయించటంతో పాటు పేరూరు డ్యాంకు కృష్ణ జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు ప్రకాష్‌రెడ్డి అన్నారు. పేద ప్రజల కష్టాన్ని తీరుస్తున్న తోపుదుర్తి కుటుంబంపై అనవసరమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని ఆయన పరిటాల శ్రీరామ్‌కు, టీడీపీ నాయకులకు సూచించారు.
చదవండి: (‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’)
Comments
Please login to add a commentAdd a comment