
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీశారు అభ్యర్థులు. దీంతో వాళ్లను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు.
జీవో నెంబర్ 46 నుంచి టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జీవో నెంబర్ 46తో హైదరాబాద్‌కు 53 శాతం రిజర్వేషన్.. మిగతా ప్రాంతాలకు 47 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. తద్వారా ఇతర జిల్లాల వాళ్లకు మార్కులు ఎక్కువ ఎంపిక కాకపోవచ్చు. పైగా ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment