డీజీపీ కార్యాలయాన్ని కబ్జా చేయాలనుంది: చంద్రబాబు | CM Chandrababu Naidu to Inaugurates AP Police Headquarters | Sakshi
Sakshi News home page

డీజీపీ ఆఫీస్‌ను కబ్జా చేయాలనుంది: బాబు

Published Wed, Aug 16 2017 4:29 PM | Last Updated on Fri, May 25 2018 7:06 PM

CM Chandrababu Naidu to Inaugurates AP Police Headquarters

అమరావతి: డీజీపీ కార్యాలయాన్ని చూస్తే  కబ్జా చేయాలనుందని, తన ఆఫీస్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలని ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చమత్కరించారు. ఆయన బుధవారం అమరావతిలో నూతనంగా నిర్మించిన డీజీపీ హెడ్‌ క్వార్టర్స్‌ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆక్టోపస్ విన్యాసాలను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. డీజీపీ ఆఫీస్ ఓ గార్డెన్  మాదిరిగా ఉందన్నారు. కార్పొరేట్  సెక్టార్ కూడా ఇలాంటి బిల్డింగ్ కట్టలేరని అన్నారు. మనకు ఉన్న వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు.
 
అమరావతిలో మంచి వాతావరణం ఉంటుందని.. మంచి నేల, నీరు, కొండలతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ఆక్టోపస్ వాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చారని తెలిపారు. ఆక్టోపస్ చేస్తున్న విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. 20 సంవత్సరాల క్రితం ఆక్టోపస్‌ అవసరం ఎంతో ఉండేదన్నారు. గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్‌ను చూస్తే ఏపీ సేఫ్‌లో ఉందనే నమ్మకం కలుగుతుందన్నారు. నిన్న ఢిల్లీలో దేశం మొత్తం కలిపి 192 అవార్డులు ఇస్తే , అందులో  52 ఏపీకి రావడం గర్వ కారణమన్నారు. పోలీసులందరికీ అందరికి సొంత ఇంటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నిన్న వినుకొండ లో అధికారులు, పోలీసుల పని తీరును అభినందిస్తున్నానన్నారు. అందరూ కలిసి ఓ పసి వాడిని కాపాడారని మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement