సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాకు కొత్త పోలీస్‌బాస్‌గా పి.విశ్వప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.నాగేంద్రకుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలొచ్చాయి. జిల్లాకు ఎస్పీగా రానున్న పి.విశ్వప్రసాద్ మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం కొండపాక గ్రామానికి చెందినవారు.
1996 బ్యాచ్‌కు చెందిన ఆయన ఇప్పటి వరకు కడప, పరకాల, గురజాల ప్రాంతాల్లో డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత వరంగల్ అదనపు ఎస్పీగా, విశాఖపట్నం ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు 2011లో ఐపీఎస్ హోదా దక్కింది. ఆ తర్వాత ఇంటలిజెన్స్ ఎస్పీగా, విశాఖపట్నంలో శాంతిభద్రతల డీసీపీగా పనిచే శారు. ప్రస్తుతం ఎల్‌బీనగర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న విశ్వప్రసాద్ జిల్లాకు ఎస్పీగా తొలిసారి రానున్నారు.
ఏపీకి నాగేంద్రకుమార్
జిల్లాకు పోలీస్‌బాస్‌గా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన నాగేంద్రకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే అవకాశ ం ఉంది. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపకాల కోసం కేంద్రం ఏర్పాటుచేసిన ప్రత్యుష్‌సిన్హా కమిటీ కూడా నాగేంద్రకుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. దీనిపై మరో రెండువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌లను తెలంగాణ ప్రభుత్వం బదిలీచేసింది. నాగేంద్రకుమార్ ఏపీకి వెళ్లాల్సి ఉన్నందున ఆయనకు తెలంగాణలో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
రెండేళ్లకు పైగా..
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా నాగేంద్రకుమార్ రెండేళ్లకు పైబడిగా పనిచేశారు. అప్పటినుంచి రెండేళ్ల మూడునెలలుగా ఆయన జిల్లాకు సేవలందిస్తున్నారు. గత 30ఏళ్లలో ఇలాంటి అవకాశం లభించిన అతికొద్దిమంది ఎస్పీల్లో నాగేంద్రకుమార్ ఒకరు. ఇలా రెండేళ్లకు పైబడి జిల్లా ఎస్పీగా గతంలో జితేందర్, సుధీర్‌బాబులు పనిచేశారు.
పోలీసుల సంక్షేమానికి కృషి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా ఎస్పీగా డి.నాగేంద్రకుమార్ 2012 జూలై5న బాధ్యతలు చేపట్టారు. అప్పటికే జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. అయినా జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరుసగా జరిగిన మునిసిపిల్, గ్రామపంచాయతీ, సాధారణ ఎన్నికల్లో ఎటువంటి సంఘవ్యతిరేక చర్యలు చోటుచేసుకోకుండా, అవినీతి అక్రమాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకునే విధ ంగా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
దీనికితోడు అంతర్ జిల్లా దొంగలముఠాను పట్టుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. పోలీసుల సంక్షేమానికి ఎనలేని కృషిచేశారు. ముఖ్యంగా పోలీసుల అమరుల కుటుంబాలకు ఇళ్లస్థలాలు కేటాయించడంతో పాటు నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే విధంగా కృషిచేశారు.
జిల్లా ఎస్పీగా పి.విశ్వప్రసాద్
Published Mon, Oct 27 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
Advertisement
Advertisement