సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో కమ్యూనికేషన్స్ విభాగం హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కొలుకూరి శ్రీధర్‌కు అమెరికాలోని హోన్‌స్టన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. దూర విద్యా విధానంలో ‘పోలీస్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ఇన్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఏపీ’ అనే అంశంపై చేసిన పరిశోధనకుగానూ ఈ పురస్కారం అందుకున్నారు. పట్టాను బెంగళూరులోని వర్శిటీ భారత ప్రధాన కార్యాలయం సోమవారం శ్రీధర్‌కు అందజేసింది.
హైదరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన శ్రీధర్ 1996లో పోలీసు కమ్యూనికేషన్స్‌లో కానిస్టేబుల్‌గా చేరారు. పీహెచ్‌డీ చేయడంలో భాగంగా 2012లో వర్శిటీకి అప్లై చేసుకున్న శ్రీధర్ దాదాపు మూడు వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి పరిశోధన పత్రాలను రూపొందించారు. యూనివర్శిటీ డెరైక్టర్ కోడూరి వెంకటేష్ సారథ్యంలో రూపొందించారు. శ్రీధర్ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. డాక్టరేట్‌ను తన తల్లికి అంకితమిస్తున్నానని చెప్పారు.
హెడ్ కానిస్టేబుల్‌కు ‘అమెరికా’డాక్టరేట్
Published Wed, Jun 24 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM
Advertisement
Advertisement