Nalgonda: Enquiry On Circle Inspector For Bribing Money - Sakshi
Sakshi News home page

మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు

Published Wed, Dec 1 2021 1:09 PM | Last Updated on Wed, Dec 1 2021 3:10 PM

Enquiry On Circle Inspector For Bribing Money Nalgonda - Sakshi

సాక్షి,డిండి(నల్గొండ): నేరేడుగొమ్ము మండలం చర్లపల్లి తండాకు చెందిన బాలికతో పెద్దఅడిశర్లపల్లి మండలం గడ్డమీది తండాకు చెందిన బాలుడు ప్రేమ పేరుతో ఇరువురు సఖ్యతగా ఉన్న ఫొటోలు తీసి సదరు బాలిక బంధువులు, మిత్రుల వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశాడు. ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో డిండి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆ బాలుడిపై 164 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

కాగా బాలుడి తండ్రి అభ్యర్థన మేరకు కేసు మాఫీ చేయించేందుకు సీఐడి. వెంకటేశ్వర్లు రూ.లక్ష డిమాండ్‌ చేసినట్లు గత నెల 19వ తేదీన సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో వైరల్‌ అయ్యింది. దీనిపై 20వ తేదీన సాక్షి దినపత్రికలో ‘సీఐపై అవినీతి ఆరోపణలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎస్పీ రంగనాథ్‌ సీఐపై విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగానే మంగళవారం సీఐ వెంకటేశ్వర్లును వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: అయ్యా.. ఇక మాకు దిక్కెవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement