జనసేన నేతపై రెచ్చిపోయిన చంద్రగిరి సీఐ
పట్టా భూమి వ్యవహారంలో టీడీపీ నేతకు సీఐ బాసట
ఆత్మహత్యకు యత్నించిన బాధితుడు
సాక్షి, టాస్‌్కఫోర్స్: పట్టా భూమి విషయంలో టీడీపీ నేతకు బాసటగా నిలిచిన చంద్రగిరి సీఐ జనసేన నేతను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా ‘నా కొడకా.. గన్‌తో కాల్చేస్తా..’ అంటూ బూతులు లంకించుకున్నారు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని జనసేన నేత పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది.
వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాకాలవారిపల్లికి చెందిన పాశం గురుమూర్తి జనసేన నేత. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని విజయానికి తీవ్రంగా కృషి చేశాడు. కాగా.. గురుమూర్తి తండ్రి గురవయ్యకు అదే మండలం పనపాకంలో సర్వే నంబర్ 395/2డిలో రెండున్నర ఎకరాల పట్టా భూమి ఉంది.
తండ్రి చనిపోవడంతో భూమిని తనపేరిట మార్చాలని గురుమూర్తి రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చాడు. ఆ భూమిని కాజేసేందుకు టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఆ భూమి ఆన్లైన్ కాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత సుబ్రహ్యణ్యంనాయుడు గురుమూర్తిపై చంద్రగిరి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించడంతో పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది.
ఆత్మహత్యకు ప్రయత్నం
గౌరవంగా బతుకుతున్న తనను సీఐ అసభ్యంగా దూషించడమే కాకుండా చంపుతామని బెదిరించడాన్ని గురుమూర్తి తట్టుకోలేకపోయాడు. ఇంటికెళ్లిన గురుమూర్తి మనస్తాపంతో అదే రోజు రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని, సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి గురుమూర్తి ఫిర్యాదు చేశాడు.
‘కాల్చి పారేస్తే అడిగే దిక్కుండదు’
పట్టా భూమి వ్యవహారంలో టీడీపీ నేతకు బాసటగా నిలిచిన సీఐ సుబ్బరామిరెడ్డి ఆదివారం నాడు గురుమూర్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి బెదిరించారు. ‘నా కొ..ను.. పగలకొట్టి లోపలేయండి. నీయమ్మా లం.. కొడకా. ఏమనుకుంటున్నావురా. దొంగ నా కొ.. బూటు కాలితో తంతా నా కొ.. మళ్లీ మాట్లాడితే గన్‌తో కాల్చిపారేస్తా’ అంటూ సీఐ సుబ్బరామిరెడ్డి తనను దూషించి కొట్టినట్టు బాధితుడు గురుమూర్తి వాపోయాడు.
కాల్చేస్తా.. అంటూ టేబుల్‌పై తుపాకీ పెట్టి బెదిరించినట్టు కన్నీరుమున్నీరయ్యాడు. ‘నా మాట కూడా వినండి సార్. నేనూ చదువుకున్న వాడినే. అలా తిట్టకండి సార్’ అని వేడుకున్నా కనికరించలేదని గురుమూర్తి వాపోయాడు. కాగా.. సీఐ సుబ్బరామిరెడ్డిపై తొలి నుంచి అనేక ఆరోపణలున్నాయి. గ్రావెల్, ఇసుక దందాలకు సీఐ వత్తాసు పలుకుతున్నారని స్థానికులు బహిరంగంగానే చెబుతూ అనేక ఉదంతాలను గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment