బనశంకరి(బెంగళూరు): తన నియోజకవర్గం నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీఐ కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేస్తారనే దానిపై బెంగళూరు దక్షిణ బీజేపీ ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప మండిపడ్డారు. సోమవారం ఎలక్ట్రానిక్‌సిటీ సమీపంలోని శికారిపాళ్యలో ఎమ్మెల్యే ఒక కార్యక్రమంలో మాట్లాడారు. అతనెవరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంట. అలాంటి బచ్చా సీఐ లాంటి వారిని ఎంతో మందిని చూశా. నా రాజకీయ వయసు అతడికి లేదు. నేను మూడోకన్ను తెరవలేదు. మూడోకన్ను తెరిస్తే అతను బళ్లారి, రాయచూరు, గుల్బర్గాలో పడతాడు. అలాగే చేస్తాడని కృష్ణప్ప మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment