
సాక్షి, విజయవాడ: సరిహద్దు తగాదాలో ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఓ సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. సరిహద్దు విషయమై కొద్దికాలంగా ఎస్‌ఎల్‌వి రియల్ ఎస్టేట్, కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమానుల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. అయితే, గుణదల సీఐ శ్రీనివాస్ రియల్టర్ల మధ్య వివాదంలో తలదూర్చారు. ఎస్‌ఎల్‌వి రియల్ ఎస్టేట్ యజమానికి కొమ్ముకాసిన సిఐ.. కోర్టులో వివాదం ఉండగానే ఎస్‌ఎల్‌వి యజమాని ఫిర్యాదు మేరకు దేవినేని శ్రీహరిపై కేసు నమోదు చేశారు.
కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి ఇంటికెళ్లి సీఐ శ్రీనివాస్ దౌర్జన్యం చేశారు. రౌడీ షీట్ తెరుస్తానంటూ బెదిరింపులకు దిగారు. శ్రీహరి భార్య పట్ల కూడా సీఐ అసభ్యకరంగా వ్యవహరించారు. సీఐ శ్రీనివాస్ వ్యవహారశైలిపై స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం ఘటనపై సీపీకి నివేదిక ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment