Gunadala
-
బెదిరింపులు.. దౌర్జన్యం.. గుణదల సీఐ ఓవర్‌యాక్షన్
సాక్షి, విజయవాడ: సరిహద్దు తగాదాలో ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఓ సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. సరిహద్దు విషయమై కొద్దికాలంగా ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్, కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమానుల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. అయితే, గుణదల సీఐ శ్రీనివాస్ రియల్టర్ల మధ్య వివాదంలో తలదూర్చారు. ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్ యజమానికి కొమ్ముకాసిన సిఐ.. కోర్టులో వివాదం ఉండగానే ఎస్ఎల్వి యజమాని ఫిర్యాదు మేరకు దేవినేని శ్రీహరిపై కేసు నమోదు చేశారు.కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి ఇంటికెళ్లి సీఐ శ్రీనివాస్ దౌర్జన్యం చేశారు. రౌడీ షీట్ తెరుస్తానంటూ బెదిరింపులకు దిగారు. శ్రీహరి భార్య పట్ల కూడా సీఐ అసభ్యకరంగా వ్యవహరించారు. సీఐ శ్రీనివాస్ వ్యవహారశైలిపై స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం ఘటనపై సీపీకి నివేదిక ఇవ్వనున్నారు. -
ఘనంగా మేరీమాత ఉత్సవాలు
గుణదల (విజయవాడ తూర్పు): క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం విజయవాడ గుణదలలోని మేరీమాత ఆలయంలో ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానాల యం దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కతోలిక గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. భక్తుల పాలిట కల్పతరువుగా మేరీమాత కొలువుదీరిందన్నారు. దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా లోక రక్షకుడైన క్రీస్తును ఈ లోకానికి అందించి లోకమాతగా కీర్తించబడిన మరియతల్లిని ఆశ్రయించిన భక్తుల జీవితాలు దీవెనకరంగా ఉంటాయని తెలిపా రు. గుణదల పుణ్యక్షేత్రం స్థాపించబడి నూరు వసంతాలు పూర్తి కావడం హర్షణీయమన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలకు హాజరై భక్తులు మరియమాత ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, ఫాదర్ సునీల్ రాజు, ఫాదర్ పసల థామస్ తదితరులు పాల్గొన్నా రు. ఉత్సవాల తొలిరోజున యాత్రికులు పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. -
ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత శతాబ్ధి ఉత్సవాలు
గుణదల/రైల్వేస్టేషన్(విజయవాడ తూర్పు/పశ్చిమ): క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన గుణదల మేరీమాత ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి సమిష్టి దివ్యబలి పూజతో ఉత్సవాలను బిషప్ తెలగ తోటి రాజారావు ప్రారంభించారు. ఉత్సవాల్లో ఫాదర్స్,క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో జరిగే ఈ తిరునాళ్లకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీరి సౌకర్యార్ధం పుణ్యక్షేత్రంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండ దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో తొలి సమి ష్టి దివ్యబలి పూజతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. పలు ప్రభుత్వ శాఖల అధికారు ల సహకారంతో పుణ్యక్షేత్ర గురువులు తిరునాళ్ల ను సజావుగా ని ర్వహించను న్నా రు. భక్తు లు లక్షలాదిగా తరలి వచ్చి మరియమాతను దర్శించుకుని దీవెనలు పొందాలని గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక స్టాపేజ్ కేటాయించింది దక్షిణమధ్య రైల్వే. రామవరప్పాడులో నాలుగు రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు రైళ్లు భక్తుల సౌకర్యార్ధం నిమిషం పాటు తాత్కాలిక స్టాపేజ్‌లో ఆగనున్నాయి. నాలుగు రైళ్లకు రామవరప్పాడులో నిమిషం హాల్టింగ్ ఈ ఉత్సవాల కోసం రైల్వేశాఖ నేటి నుంచి మూడు రోజులపాటు రామవరప్పాడు రైల్వేస్టేషన్లో పలు రైళ్లకు ఒక నిమిషం హాలి్టంగ్ సదుపాయం కల్పించింది. పూరి–తిరుపతి (17479), బిలాస్పూర్–తిరుపతి (17481) ఎక్స్ ప్రెస్ రైళ్లు మధ్యాహ్నం 12.04 గం.లకు రామవరప్పాడు చేరుకుని 12.05 గం.లకు బయలుదేరతాయి. తిరుపతి–పూరి (17480), తిరుపతి–బిలాస్పూర్ (17482) రైళ్లు సాయంత్రం 6.44 గం.లకు రామవరప్పాడు చేరుకుని, తిరిగి 6.45 గం.లకు బయలుదేరతాయి. -
క్రిస్మస్ సందర్భంగా గుణదలలో ప్రత్యేక ప్రార్థనలు
-
విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు..
సాక్షి, విజయవాడ: నగరంలో సిమ్‌కార్డుల దందా వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు జారీ కావడం కలకలం రేగుతోంది. డాట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్) ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను సీపీ రానా ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ఒకే ఫొటోతో ఓ నెట్వర్క్ సంస్థకు 658 సిమ్‌లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ సిమ్ కార్డుల్ని రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు. అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్ కార్డులు నకిలీ పత్రాలతో జారీ చేసినట్లు గుర్తించారు. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా సిమ్ కార్డుల దందా బయటపడింది. చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. \ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తించారు. ఈ సిమ్‌లు ఎక్కడికి వెళ్లాయి.. ఎవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గుణదల మేరీ మాత తిరునాళ్లు (ఫొటోలు)
-
పూజకు కొత్త కారు.. బ్రేక్ బదులు ఎక్సలేటర్‌ను తొక్కడంతో...
గుణదల(విజయవాడ తూర్పు): జన సంచారం అధికంగా ఉండే సమయంలో నడి రోడ్డుపై కొత్త కారు బీభత్సం సృష్టించింది. మాచవరం దాసాంజనేయ స్వామి గుడి వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్ధానికంగా కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ చుట్టుగుంట ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్(40) ప్రైవేటు ఉద్యోగి, శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో స్ధానిక దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద (ఏపీ 16 బిఎల్ 1656) నంబరు గల తన కారును పూజ చేయించేందుకు వచ్చాడు. అనంతరం స్వామిని దర్శించుకుని కారును తీశాడు. బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ను తొక్కడంతో ఒక్కసారిగా ఆ కారు పెద్ద శబ్దంతో ముందుకు దూకింది. ఈ శబ్దానికి భయపడిన అక్కడి భక్తులు, వాహన చోదకులు పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడివారక్కడ పారిపోవడంతో కారు చుట్టు పక్కల ఉన్న వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పంగా గాయపడగా, ఐదు ద్విచక్ర వాహనాల ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా క్రిస్మస్ వేడుకలు
గుణదల (విజయవాడ తూర్పు)/అనంతపురం కల్చరల్: లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగానున్న క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీ విశేషంగా ఆకట్టుకోగా.. పశువుల పాకలో కొలువైన బాలయేసును భక్తి శ్రద్ధలతో పూజించారు. కాగా క్రైస్తవ విశ్వాసులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి చేరుకోవడంతో గుణదల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతపురంలో క్రిస్మస్ ప్రార్థనలకు హాజరైన భక్తులు రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు మాట్లాడుతూ.. యేసుక్రీస్తు ఆచరించి చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అనంతపురం ఎస్ఐయూ చర్చిలో జరిగిన వేడుకల్లో శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. గుణదల మేరీమాత ఆలయం వద్ద భక్తుల సందడి -
ఆ మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేయాలి..
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ ముందుల కొనుగోలు కుంభకోణంపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల స్కాం కి పాల్పడిన టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డొల్ల కంపెనీలు, నకిలీ బిల్లులతో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద సోమవారం సీఐటీయూ ఆందోళన చేపట్టింది. అక్రమార్కులు దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన మాజీ మంత్రులు, చేతులు కలిపిన అధికారులను కూడా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాల చేశారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేసైనా కార్మికులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే గఫుర్ డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కార్మికుల్లో కూడా బీసీలు ఉన్నారన్నారు. కార్మిక శాఖకు బీసీలే మంత్రులుగా ఉంటారని.. అక్రమాలకు పాల్పడితే బీసీ మంత్రులని వదిలేయాలా అని ప్రశ్నించారు. టీడీపీ వాదన వింటుంటే విస్మయం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే గఫుర్ అన్నారు. -
నేటి నుంచి గుణదలలో మేరీమాత నవదిన ప్రార్థనలు
సాక్షి, విజయవాడ: క్రైస్తవ ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో నేటి(శుక్రవారం) నుంచి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు క్యాథలిక్ పీఠం బిషప్ కలగతోటి రాజారావు తెలిపారు. గుణదల మేరీ మాత నవదిన ప్రార్థనలు ప్రారంభమయిన సందర్బంగా పుణ్యక్షేత్ర ఆవరణంలో పతాకం ఆవిష్కరణ చేసి లాంఛన ప్రాయంగా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులు దివ్య సత్పసాద ఆరాధనతో కొండపై ఉన్న మేరీమాత గృహ వద్దకు చేరుకుని.. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిని బలిపీఠం వద్ద సమిష్టి దివ్యబలి పూజ సమర్పణ చేశారు. ముదటి రోజు క్రైస్తవ విశ్వాసులు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కంటైనర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి
-
వైఎస్సార్ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలో కారు అదుపు తప్పి కంటైనర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లీకొడుకు సహా కారు డ్రైవర్ ఉన్నారు. వీరంతా నందలూరు మండలం నీలిపల్లె గ్రామస్తులు. కడప నుంచి చెన్నైకి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు దాసరి మణెమ్మ (45), సాయి కిరణ్, (19), పవన్ కల్యాణ్ (25)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. డివైడర్‌ను ఢీకొన్న ఆరెంట్ ట్రావెల్స్ బస్ కాగా విజయవాడ గుణదల సమీపంలో ఆరెంట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోల్తా పడిన బస్సును పోలీసులు క్రేన్ సాయంతో పక్కకి తొలగించారు. గాయపడిన ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కంటైనర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి మరోవైపు తెలంగాణలో సిద్ధిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మానకొండూరు మండలం వేగురుపల్లికి చెందినవారు. వీరంతా హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. -
సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే..
సాక్షి, గుణదల(విజయవాడ): ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి మొగల్రాజపురం ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొగల్రాజపురం కొండ ప్రాంతానికి చెందిన నాగులపల్లి రామలక్ష్మి(45) ఇళ్లలో పనులు చేసుకుంటూ బతుకుతోంది. భర్తలేని కారణంగా పిల్లలతో జీవనంసాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు(48) మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల వద్ద రోడ్డు పక్కన చెప్పులు కుడుతుంటాడు. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. భర్తలేని రామలక్ష్మిపై కన్నేసిన నాగేశ్వరరావు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను తన కోరిక తీర్చాలని వెంటపడ సాగాడు. ఆమె నిరాకరించడంతో తనతో సహజీవనం చేయాలని బలవంతం చేస్తున్నాడు. తనకు పిల్లలు ఉన్నారని, వారి కోసమే కష్టపడి బతుకుతున్నానని ఆమె చెప్పినా ఎంతకీ తన దారిలోకి రాకపోవడంతో ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. నడిరోడ్డుపై దాడికి.. మొగల్రాజపురం పాత ఐదో నంబరు రూటు రోడ్డులో పనికి వెళ్లిన ఆమెను వెంబడించాడు. ఓ ఇంట్లో పని ముగించుకుని వస్తున్న రామలక్ష్మిని అడ్డగించి నడిరోడ్డుపై దాడికి దిగాడు. విచక్షణా రహతంగా కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. అతడి వద్ద ఉన్న కొడవలితో పీక కోయడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఈ గొడవను చూస్తున్న స్థానికులు అడ్డుపడి నాగేశ్వరరావును పక్కకు లాగారు. కత్తి గాటుకు గొంతు పాక్షికంగా తెగటంతో రామలక్ష్మి రక్తపు మడుగులో పడిఉంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణాపాయస్థితి లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసేందుకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఉన్నదంతా ఉడ్చేశాడు.. కామాంధుడైన నాగేశ్వరరావుకు అమాయకులైన మహిళలను లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్నాడని కొండ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మహిళల వెంట పడి వేధిస్తూ వారి వద్ద లక్షలాది రూపాయలు దిగ మింగాడని స్థానికులు చెబుతున్నారు. చివరికి మహిళలను హత్య చేసేందుకు కూడా వెనుకాడక బరితెగించాడని నాగేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. -
వివాహితను రక్షించబోయి..ప్రాణాలు కోల్పోయాడు
సాక్షి, విజయవాడ: వివాహితను రక్షించబోయి ఇద్దరు యువకులు గల్లంతు అయిన ఘటన విజయవాడలోని గుణదలలో చోటుచేసుకుంది. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గుణదలకు చెందిన రాణి అనే ఓ మహిళ మంగళవారం గుణదల రైవస్ కాల్వలో దూకేసింది. అదే సమయంలో అక్కడ ఉన్న అయిదుగురు యువకులు గమనించి ఆమెను రక్షించేందుకు కాలువలోకి దూకారు. వీరిలో ముగ్గురు యువకులు రాణిని రక్షించి బయటకు తీసుకొని రాగా, మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కాగా గల్లంతైన యువకులను వడుగు శివరామకృష్ణ (నాని), తాడేపల్లి సాయి అజయ్‌గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. గాలింపులో భాగంగా గల్లంతు అయిన శివరామకృష్ణ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇవాళ సాయంత్రం ఒడ్డుకు చేర్చింది. మహిళను రక్షించబోయి ప్రాణాలు పోగొట్టుకున్న శివరామకృష్ణ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యుల కన్నీటి పర్యంతమయ్యారు. -
ప్రమాదపుటంచున ప్రయాణం
సాక్షి, విజయవాడ : ప్రమాదకరంగా ఉన్న కాలిబాటల్లో రాకపోకలు సాగించలేక కొండ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నడిచేందుకు వీలులేని మెట్ల మార్గంలో తరచూ ప్రమాదాలకు గురవుతున్న పేదల పరిస్థితి దయనీయంగా ఉంది. నాల్గవ డివిజన్ పరిధిలోని కార్మికనగర్ కొండ ప్రాంత ప్రజల తీరని సమస్య ఇది. ఇళ్లు కొనే స్తోమత లేక, కనీసం ఇంటి అద్దెలు కట్టుకునే పరిస్థితి లేని పేదలు కొండ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ జీవిస్తున్నారు. ఉదయాన్నే సద్ది మూట కట్టుకుని కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు. నిత్యం వీరు రాకపోకలు సాగించే కాలిబాటలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఏళ్లు గడిచినా ఇక్కడ మెట్ల మార్గాల నిర్మాణాలే లేవు. దీంతో స్థానికులు ప్రమాదపుటంచున ప్రయాణాలు సాగిస్తున్నారు. అడుగు జారితే అఘాతంలోకే అన్నట్లుంది ఇక్కడి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వర్షకాలం ఇక్కడ రాకపోకలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. పిల్లలు, మహిళలు వచ్చిపోయే సమయంలో పడిపోయి గాయాలపాలైన సందర్భాలు లేకపోలేదు. మామూలుగానే నడవలేక పోతుంటే నిత్యావసరాలకు సంబంధించిన బరువైన వస్తువులు పైకి చేరవేసేందుకు స్థానికులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని సార్లు తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకున్న వారే లేరని ఇక్కడి వారు చెబుతున్నారు. ఓట్ల కోసం తప్పా నేతలు తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావడంలేదని ఆరోపిస్తున్నారు. నాయకులు, అధికారులు మారుతున్నారే తప్పా తమ స్థితిగతులు మారటం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో కాలిబాటలు మెరుగు పరిచి, మెట్ల మార్గాలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
అక్కాచెల్లెళ్లలో ఒకరి ఆచూకి లభ్యం
గుణదల(విజయవాడ తూర్పు): కుటుంబ సమస్యల రీత్యా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వద్దకు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఓ సోదరి మంగళవారం విజయవాడకు చేరుకుంది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగిరెద్దుల దిబ్బ కొండ ప్రాంతానికి చెందిన కోట గాయత్రి, కోట సోనియా ఇద్దరు ఈ నెల 4న చింతమనేనిని కలిసేందుకు వెళ్లారు. అప్పటి నుంచి వారిరువురి ఆచూకీ తెలియక పోవడంతో వారి తల్లి మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రెండో కుమార్తె సోనియా మంగళవారం నగరానికి చేరుకుంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరులో తాను చదువుకున్న పాఠశాలలో సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు తెలిపింది. తన అమ్మమ్మ అయిన భాగ్యలక్ష్మి ఇంటివద్దే ఉన్నట్లు చెప్పింది. తన అక్క గాయత్రి ఈ నెల 5నే ఏలూరు నుంచి విజయవాడ చేరుకున్నట్లు పోలీసుల వద్ద ఒప్పుకుంది. అనంతరం పోలీసులు సోనియాను ఆమె తల్లికి అప్పగించారు. గాయత్రి కోసం దర్యాప్తు ముమ్మరం చేస్తామని వారు తెలిపారు. తన పెద్ద కుమార్తెను తనకు అప్పజెప్పాలని తల్లి మీడియా వద్ద వేడుకుంది. -
ఈఎస్ఐ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ర్యాలీ
విజయవాడ(గుణదల) : పరిశుభ్రతే భారత దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తోందని ఈఎస్ఐ రీజనల్ డైరెక్టర్ పి.ఆర్.దాస్ అన్నారు. ఈఎస్ఐ ప్రాంతీయ కార్యాలయం అధికారులు, సిబ్బంది కార్యాలయం నుంచి గుణదల సెంటర్–రామవరప్పాడు వరకు స్వచ్ఛభారత్ ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్వచ్ఛభారత్ పక్షోత్సవాలు నిర్వహిస్తుందని, అందులో మొక్కలు నాటడం, పాత ఫైళ్లను తొలగించటం, కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉం^è టం వంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కను నాటటమే కాకుండా మొక్క చెట్టుగా మారే వరకు దాని పూర్తి బాధ్యత సంబంధింత ఉద్యోగే చూసుకోవాలన్నారు. తమ కార్యాలయ ప్రాంగణంలో ఇప్పటి వరకు 500 మొక్కలు నాటి వాటి సంరక్ష చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్ పాల్గొన్నారు. -
ఫాదర్ జోసెఫ్ వెంపనీకి కన్నీటి వీడ్కోలు
విజయవాడ (గుణదల) : విజయవాడ కేథలిక్ డయాసిస్ పరిధిలో నాలుగు దశాబ్దాలపాటు సేవలందించిన ఫాదర్ జోసెఫ్ వెంపనీ(77)కి ఆయన బంధువులు, ఫాదర్లు, భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఫాదర్ జోసెఫ్ వెంపనీ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో నిర్వహించారు. సాయంత్రం 3.30 గంటలకు గుణదల చర్చి సమీపంలోని వియన్నా హోం నుంచి ఫాదర్ జోసఫ్ వెంపనీ భౌతికకాయాన్ని ఊరేగింపుగా మేరీమాత చర్చికి తీసుకొచ్చారు. విశాఖపట్నం ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాష్, మాజీ బిషప్ మాథ్యూ చెరియన్ కున్నెల్, విజయవాడ డయాసిస్ వికార్స్ జనరల్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ఆధ్వర్యాన సమష్టి దివ్య బలిపూజ నిర్వహించారు. ఫాదర్ జోసెఫ్ వెంపనీ ఆత్మకు శాంతికలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని వందలాది మంది భక్తులు సమీపంలోని శ్మశానవాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఫాదర్ ఎం.గాబ్రియేల్, ఫాదర్ వల్లే జోజిబాబు, డయాసిస్ కోశాధికారి జోజిబాబు, ఫాదర్ ఆంటోనీ, డయాసిస్ గురువులు, మతకన్యలు, భక్తులు హాజరయ్యారు. -
దుస్తులు ఉతికిన నీటితో వంట
12 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత విజయవాడ(గుణదల): కలుషితాహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం విజయవాడలోని గుణదల గంగిరెద్దుదిబ్బలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చోటుచేసుకుంది. విద్యార్థునులు తెలిపిన వివరాల ప్రకారం... వసతి గృహంలో సుమారు 50 మంది విద్యార్థునులు ఉన్నారు. హాస్టల్లో సోమవారం వంటమనిషి స్వర్ణ గైర్హాజరు కావడంతో ఆమె కూతురు వచ్చి వంట చేసింది. విద్యార్థినులు దుస్తులు ఉతికిన సర్ఫ్ నీటితోనే పప్పు కడిగి.. మళ్లీ అదే నీటితో వంట చేయడంతో వాటిని తిన్న విద్యార్థినుల్లో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, నాలుకమంట, వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ సమాచారాన్ని బాలికల్లో కొందరు ఓ విద్యార్థి సంఘ ప్రతినిధులకు తెలిపారు. వారు విద్యార్థులను సకాలంలో ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రమాదం తప్పింది. -
కిక్కిరిసిన గుణదల: మేరీమాత ఉత్సవాలు ప్రారంభం
గుణదల: విజయవాడ నగరంలోని గుణదల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. మంగళవారం నుంచి మేరీమాత ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచేకాక తెలంగాణకు చెందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున పుణ్యక్షేత్రానికి తరలివస్తుండటంతో మేరీమాత ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడ క్యాథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఎం.చిన్నప్ప తదితర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల తొలి సమష్టి దివ్యబలి పూజను గోల్డెన్ జుబిలేరియన్ గురువులు టీహెచ్ జాన్మాథ్యూ, ఫాదర్ వెంపని జోసెఫ్, సిల్వర్ జుబిలేరియన్ గురువులు ఫాదర్ పి.జ్వాకీమ్, లాము జయరాజు తదితర గురువులు సమర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు ప్రారంభ సందేశమిస్తూ, లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అందించిన మరియమాతను ప్రార్థించడం ద్వారా సర్వజనులకు దీవెనలు లభిస్తాయని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు మరియమాత విగ్రహాన్ని గుణదల పురవీధులలో ఊరేగించారు. మరియమాత స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు కొబ్బరికాయలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు రెండో సమష్టి దివ్యబలి పూజ జరిగింది. వరంగల్ పీఠాధిపతి ఉడుముల బాల, బిషప్ తెలగతోటి రాజారావు, ఫాదర్ చిన్నప్ప తదితర గురువులు రెండోసారి దైవ సందేశం అందించి బలిపూజ సమర్పించారు. -
జ్వరవాడ
పారిశుధ్య లేమితో మోగుతున్న ప్రమాద ఘంటికలు పూడుకుపోతున్న డ్రెయిన్లు వర్షంతో ఇళ్లలోకి ప్రవేశిస్తున్న మురుగు ఎక్కడి చెత్త అక్కడే.. నగరం.. వ్యాధులమయం ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గుణదల, టీచర్స్ కాలనీ, బసవ తారకనగర్లో ఇప్పటికే మూడు మలేరియా కేసులు నమోదయ్యాయి. వన్‌టౌన్‌లోని ఫోర్‌మెన్ బంగళా, వించిపేట ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె ప్రభావంతో చెత్త ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. డ్రెయిన్లు పొంగి నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డేంజర్ బెల్స్ మోగుతున్నా అధికారులు, పాలకుల్లో కనీస స్పందన లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సెంట్రల్ : కార్పొరేషన్‌లోని అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో పారిశుధ్యం క్షీణించింది. డ్రెయిన్ల నుంచి దుర్గంధం వెదజల్లుతోంది. లోతట్టు ప్రాంతాల్లో మురుగు పొంగిపొర్లుతోంది. నగరంలో 1,194 కిలోమీటర్ల మేర డ్రెయిన్లు ఉన్నాయి. రోజూ మూడు కోట్ల గాలన్లకుపైగా మురుగు నీరు ఉత్పత్తి అవుతోందని అంచనా. మొత్తం నీటి వినియోగంలో 80 శాతం తిరిగి మురుగునీరుగా మారుతోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో డ్రెయిన్ల నిర్వహణను గాలికి వదిలేశారు. వన్‌టౌన్‌లోని అనేక ప్రాంతాల్లో మురుగు మేట వేసింది. ఓపెన్ డ్రెయిన్లలో సిల్టు తొలగింపు ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. వీధుల్లోని సైడ్ కాల్వల చెత్త ప్రధాన డ్రెయిన్లకు చేరింది. రామవరప్పాడు, గుణదల ఈఎస్ఐ, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లలో డ్రెయినేజీ పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మురుగు మరింత ముంచెత్తుతోంది. డ్రెయిన్ల పూడికతీతకు ఈ ఏడాది రూ.1.28కోట్లు కేటాయించారు. వేసవి ముగుస్తున్న తరుణంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అరకొరగా చేసి వది లేశారు. 30 శాతం కూడా సిల్టు తొలగించలేదు. దీంతో శివారు ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. చెత్త తొలగింపు అరకొరే.. నగరంలో రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో 150 టన్నుల్ని కూడా డంపింగ్ యార్డుకు పంపలేని పరిస్థితి నెలకొంది. బందరు, ఏలూరు రోడ్లను స్వీపింగ్ మిషన్‌తో శుభ్రం చేస్తున్నారు. గంటకు నాలుగు కిలోమీటర్లు శుభ్రంచేసే సామర్థ్యం ఈ మిషన్‌కు ఉంది. రాత్రి ప్రారంభించి తెల్లవారే వరకు ఈ రెండు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లు (పీహెచ్) 810 మందికి గానూ 600 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. డెప్యూటేషన్లను రద్దు చేసినప్పటికీ కార్మికులు ఆయా విభాగాలను వదిలి రావడం లేదు. డంపర్ బిన్లు, ఎక్కువ మొత్తంలో వేసిన చెత్తను మాత్రమే తొలగిస్తున్నారు. మురికివాడల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ఔట్సోర్సింగ్ కార్మికుల ప్రతిఘటన నేపథ్యంలో పారిశుధ్య విధులు నిర్వర్తించేందుకు కాంట్రాక్ట్ కార్మికులు ముందుకు రావడం లేదు. స్పందన నిల్ స్వచ్ఛభారత్ స్ఫూర్తితో పారిశుధ్య పనుల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలన్న కమిషనర్ పాచిక పారలేదు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, స్వచ్ఛభారత్ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచి సహకారం కొరవడింది. పారిశుధ్య పనుల్లో భాగం పంచుకొనేందుకు వారు మొహం చాటేస్తున్నారు. కాలనీవాసులు, రెండుమూడు ప్రాంతాల వారు కలిసి పారిశుధ్య పనులు చేసేందుకు మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటే రోజుకు రూ.275 చొప్పున చెల్లిస్తామని మేయర్ కోనేరు శ్రీధర్ చేసిన ప్రకటనకు ఏమాత్రం స్పందన లేదు. చిత్తు కాగితాలు ఏరుకునే వారితో ఇటీవల ప్రజారోగ్యశాఖ అధికారులు సంప్రదింపులు జరపగా కాగితాలు ఏరుకుంటే రోజుకు రూ.500 వస్తోందని వారు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. తాత్కాలిక పనికి రూ.275 గిట్టుబాటు కాదని పలువురు కార్మికులు స్పష్టం చేస్తున్నారు. -
జనసంద్రమైన గుణదల పుణ్యక్షేత్రం
-
కాకినాడ ప్యాసింజర్ రైలులో మంటలు
విజయవాడ: కాకినాడ ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైరు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. గుణదల వద్ద అధికారులు రైలు ఆపివేసి మంటలను ఆర్పివేశారు. మరమ్మత్తులు చేసిన అనంతరం రైలు బయల్దేరింది. కాగా రైలు ఆగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.