సాక్షి, విశాఖపట్నం: ఈఎస్‌ఐ ముందుల కొనుగోలు కుంభకోణంపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల స్కాం కి పాల్పడిన టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డొల్ల కంపెనీలు, నకిలీ బిల్లులతో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుణదల ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద సోమవారం సీఐటీయూ ఆందోళన చేపట్టింది. అక్రమార్కులు దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన మాజీ మంత్రులు, చేతులు కలిపిన అధికారులను కూడా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాల చేశారు. (ఈఎస్‌ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు)
మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేసైనా కార్మికులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే గఫుర్ డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కార్మికుల్లో కూడా బీసీలు ఉన్నారన్నారు. కార్మిక శాఖకు బీసీలే మంత్రులుగా ఉంటారని.. అక్రమాలకు పాల్పడితే బీసీ మంత్రులని వదిలేయాలా అని ప్రశ్నించారు. టీడీపీ వాదన వింటుంటే విస్మయం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే గఫుర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment