CITU protest
-
రోడ్డుపై కట్టెలపొయ్యితో నిరసన
-
ఆ మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేయాలి..
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ ముందుల కొనుగోలు కుంభకోణంపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల స్కాం కి పాల్పడిన టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డొల్ల కంపెనీలు, నకిలీ బిల్లులతో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద సోమవారం సీఐటీయూ ఆందోళన చేపట్టింది. అక్రమార్కులు దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన మాజీ మంత్రులు, చేతులు కలిపిన అధికారులను కూడా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాల చేశారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేసైనా కార్మికులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే గఫుర్ డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కార్మికుల్లో కూడా బీసీలు ఉన్నారన్నారు. కార్మిక శాఖకు బీసీలే మంత్రులుగా ఉంటారని.. అక్రమాలకు పాల్పడితే బీసీ మంత్రులని వదిలేయాలా అని ప్రశ్నించారు. టీడీపీ వాదన వింటుంటే విస్మయం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే గఫుర్ అన్నారు. -
రైల్వే ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం
సాక్షి, విజయవాడ : లాభాల్లో నడుస్తున్న రైల్వేను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలపై భారాలు మోపే ఆలోచనను మోదీ సర్కార్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బెజవాడ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టాయి. వివిధ కార్మిక సంఘాల నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ.....తమ సంక్షేమంపై దృష్టి సారిస్తారని భావించి ప్రధాని మోదీకి ప్రజలు రెండోసారి అధికారం అప్పచెప్పారన్నారు. రైల్వేను ప్రైవేటు పరం చేయబోమని ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారని... కానీ ఇప్పుడు ప్రధాన రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. ప్రయాణికులకు ఇచ్చే 47 శాతం సబ్సిడీని కూడా రద్దు చేస్తామని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘విదేశీ పెట్టుబడిదారులకు సొమ్మును ధారాదత్తం చేయడమే మోదీకి ఉన్న దేశభక్తా? కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతికిస్తున్నా మోదీ మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారు అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయినప్పటికీ మోదీ మూర్ఖంగా ముందుకు వెళితే దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -
పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ నిరసన
-
మేయర్‌కు తగిన గుణపాఠం చెపుతాం
సీఐటియూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు నెల్లూరు(సెంట్రల్): తమ సమస్యలు పరిష్కరించమని అడిగిన కార్మికులను పోలీసులతో కొట్టించిన కార్పొరేషన్ మేయర్ అబ్దుల్‌అజీజ్‌కు తగిన గుణపాఠం చెపుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు హెచ్చరించారు. కార్పొరేషన్లో కార్మికులపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా నగరంలోని గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ పాలన చూస్తుంటే తనమాట కాదన్నవారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ నిరంకుశంగా వ్యవరిస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టినా లాఠీచార్జీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేషన్ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని, ఆయన అవినీతిని పక్కన పెట్టి కార్మికులపై ప్రతాపం చూపించడం సిగ్గు చేటన్నారు. కాగా గాంధీబొమ్మ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టడం గమనార్హం.