- సీఐటియూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు
మేయర్‌కు తగిన గుణపాఠం చెపుతాం
Published Sun, Oct 30 2016 1:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(సెంట్రల్):
తమ సమస్యలు పరిష్కరించమని అడిగిన కార్మికులను పోలీసులతో కొట్టించిన కార్పొరేషన్ మేయర్ అబ్దుల్‌అజీజ్‌కు తగిన గుణపాఠం చెపుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు హెచ్చరించారు. కార్పొరేషన్‌లో కార్మికులపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా నగరంలోని గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ పాలన చూస్తుంటే తనమాట కాదన్నవారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ నిరంకుశంగా వ్యవరిస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టినా లాఠీచార్జీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేషన్ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని, ఆయన అవినీతిని పక్కన పెట్టి కార్మికులపై ప్రతాపం చూపించడం సిగ్గు చేటన్నారు. కాగా గాంధీబొమ్మ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టడం గమనార్హం.
Advertisement