ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ర్యాలీ
ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ర్యాలీ
Published Thu, Oct 6 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
విజయవాడ(గుణదల) : పరిశుభ్రతే భారత దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తోందని ఈఎస్‌ఐ రీజనల్ డైరెక్టర్ పి.ఆర్.దాస్ అన్నారు. ఈఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయం అధికారులు, సిబ్బంది కార్యాలయం నుంచి గుణదల సెంటర్–రామవరప్పాడు వరకు స్వచ్ఛభారత్ ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్వచ్ఛభారత్ పక్షోత్సవాలు నిర్వహిస్తుందని, అందులో మొక్కలు నాటడం, పాత ఫైళ్లను తొలగించటం, కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉం^è టం వంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కను నాటటమే కాకుండా మొక్క చెట్టుగా మారే వరకు దాని పూర్తి బాధ్యత సంబంధింత ఉద్యోగే చూసుకోవాలన్నారు. తమ కార్యాలయ ప్రాంగణంలో ఇప్పటి వరకు 500 మొక్కలు నాటి వాటి సంరక్ష చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement