ఫాదర్ జోసెఫ్ వెంపనీకి కన్నీటి వీడ్కోలు
ఫాదర్ జోసెఫ్ వెంపనీకి కన్నీటి వీడ్కోలు
Published Wed, Sep 7 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
విజయవాడ (గుణదల) : విజయవాడ కేథలిక్ డయాసిస్ పరిధిలో నాలుగు దశాబ్దాలపాటు సేవలందించిన ఫాదర్ జోసెఫ్ వెంపనీ(77)కి ఆయన బంధువులు, ఫాదర్లు, భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఫాదర్ జోసెఫ్ వెంపనీ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో నిర్వహించారు. సాయంత్రం 3.30 గంటలకు గుణదల చర్చి సమీపంలోని వియన్నా హోం నుంచి ఫాదర్ జోసఫ్ వెంపనీ భౌతికకాయాన్ని ఊరేగింపుగా మేరీమాత చర్చికి తీసుకొచ్చారు. విశాఖపట్నం ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాష్, మాజీ బిషప్ మాథ్యూ చెరియన్ కున్నెల్, విజయవాడ డయాసిస్ వికార్స్ జనరల్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ఆధ్వర్యాన సమష్టి దివ్య బలిపూజ నిర్వహించారు. ఫాదర్ జోసెఫ్ వెంపనీ ఆత్మకు శాంతికలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని వందలాది మంది భక్తులు సమీపంలోని శ్మశానవాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఫాదర్ ఎం.గాబ్రియేల్, ఫాదర్ వల్లే జోజిబాబు, డయాసిస్ కోశాధికారి జోజిబాబు, ఫాదర్ ఆంటోనీ, డయాసిస్ గురువులు, మతకన్యలు, భక్తులు హాజరయ్యారు.
Advertisement
Advertisement