
సాక్షి, విజయవాడ: క్రైస్తవ ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో నేటి(శుక్రవారం) నుంచి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు క్యాథలిక్ పీఠం బిషప్ కలగతోటి రాజారావు తెలిపారు. గుణదల మేరీ మాత నవదిన ప్రార్థనలు ప్రారంభమయిన సందర్బంగా పుణ్యక్షేత్ర ఆవరణంలో పతాకం ఆవిష్కరణ చేసి లాంఛన ప్రాయంగా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులు దివ్య సత్పసాద ఆరాధనతో కొండపై ఉన్న మేరీమాత గృహ వద్దకు చేరుకుని.. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిని బలిపీఠం వద్ద సమిష్టి దివ్యబలి పూజ సమర్పణ చేశారు. ముదటి రోజు క్రైస్తవ విశ్వాసులు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.