
ప్రతిపక్షాన్ని సింగిల్ షాట్‌లో తీసేయొచ్చు
ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సభే పూర్తిగా ఏ నిర్ణయం తీసుకున్నా, అదే వర్తిస్తుంది, రూల్స్ తో సంబంధం లేదంటే ఎప్పుడూ అధికార పక్షం మొత్తం ప్రతిపక్షాన్ని సింగిల్ షాట్‌లో తీసేయొచ్చని ఆయన చెప్పారు.
ఎందుకంటే వాళ్లకు మెజారిటీ ఉంటుందన్నారు. రోజా సస్పెన్షన్ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం బాధాకరమని, అది కఠిన విషయమని తెలిపారు. దయచేసి ఆ సస్పెన్షన్‌ను ఈ సెషన్ వరకు తగ్గిస్తే బాగుంటుందేమో పరిశీలించాలని స్పీకర్ కోడెలను ఆయన కోరారు.