Time: 05:05 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏడురోజుల పాటు సాగిన సమావేశాలు.. 26 బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ.
Time: 04:10 PM
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యారంగంపై సీఎం జగన్ శుక్రవారం ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారని పేర్కొన్నారు.
Time: 03:00 PM
ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.
Time: 01:30 PM
► ఏపీ అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లను తీసుకురావడంపై నిషేధం విధించారు. సభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దని స్పీకర్ ప్రకటించారు.
Time: 01:20 PM
ఇటీవల కురిసిన వర్షాలకు మూడు జిల్లాలో తీవ్ర నష్టం సంభవించిందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గడిచిన వంద ఏళ్లలో కనీవినీ ఎరుగని వానలు కురిశాయన్నారు. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయన్నారు. పింఛ, అన్నమయ్య రిజర్వాయర్ల కట్టలు తెగిపోయాయని, చెయ్యేరు నది పరివాహక ప్రాంతం గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయన్నారు.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వానలు కురిశాయని, 3.2 క్యూసెక్కుల వర్షం చెయ్యేరు నుంచి విరుచుకుపడిందన్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని, నష్టం వివరాలను ఎక్కడ దాచడం లేదని స్పష్టం చేశారు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు.
Time: 12:30 PM
అధ్యక్షా అని సంబోధించే స్థానంలో అక్కలాంటి వ్యక్తి జకియా ఖాన్ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చట్టసభల్లో అడుగు పెట్టడం, అంతేగాక నేడు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉండటం గర్వంగా ఉందన్నారు. ఇది మైనార్టీ అక్కాచెల్లెలమ్మలకు శుభ సంకేతామన్నారు సీఎం జగన్. ఆడవాళ్లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ఇందుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని ఆయన స్పష్ట ం చేశారు.
Time: 12:20 PM
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్‌కు బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా ఖానమ్‌కు మాట్లాడుతూ.. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు.
మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్టిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇచ్చారు.
చరిత్రలోనే తొలిసారి మైనార్టీ మహిళకు ఈస్థానానికి ఎంపిక చేయడం సాధారణ విషయం కాదన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కాగా వైఎస్సార్ జిల్లా రాయచోటిలో మైనార్టీ వర్గాలకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈక్రమంలో రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో అడుగు ముందుకు వేసి ఆమెకు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు.
► రాజ్యాంగ దినోత్సవం రోజున శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ శ్రీమతి జకియా ఖానమ్‌కు సభ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, మాధవ్, కత్తి నర్సింహరెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు.
Time: 10:42 AM
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం హామీలను అమలు చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారని.. డ్వాక్రా సంఘాలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొత్త గ్రూపులకు కూడా రుణాలు మంజూరు చేస్తున్నారన్నారు.
Time: 10:12 AM
►అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పాలన సాగుతోందన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారన్నారు. డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు నాశనం చేశారని ఎమ్మెల్యే రోజా అన్నారు.
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు విద్యారంగంపై స్వల్ప కాలిక చర్చ జరపనున్నారు. 2019-20 కాగ్ రిపోర్ట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 2021-22 వ్యయంపై అదనపు అంచనాలను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఏపీ శాసన మండలిలో నేడు విద్యుత్ సంస్కరణలు, రోడ్లపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. నేడు ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment