
కాల్‌మనీ.. కాదు అంబేద్కర్
కాల్‌మనీ - సెక్స్ రాకెట్ అంశం మీద చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అసెంబ్లీ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత వైఎస్ఆర్‌సీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముందు కాల్‌మనీ - సెక్స్ రాకెట్ అంశంపై చర్చ సాగించాలని కోరారు. మిగిలిన అంశాలు ఏవైనా ఆ తర్వాత చర్చించుకోవచ్చని సూచించారు. ఇంతకంటే ప్రధానమైన అంశం ఏమీ లేదని అన్నారు. అయితే, అందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిరాకరించారు.
నిన్నటి ఎజెండాలో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ అంశం మీద చర్చను ముందుగా చేపట్టాలని, అది పూర్తయిన తర్వాతే మరే అంశాన్నైనా చేపట్టుకోవచ్చని తెలిపారు. దానికి వైఎస్ఆర్‌సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అయినా అధికారపక్షం మాత్రం తమ పట్టు వీడకుండా ముందుగా అంబేద్కర్ అంశం మీద చర్చను ప్రారంభించింది.