call money rocket
-
నీతో ఎందుకు కనెక్ట్ అయ్యానో తెలియదు!
‘హలో.. మీ ఇంటికి రావచ్చా? ప్రాబ్లం ఏమిటో చెప్పండి.. మళ్లీ ఫోన్ చేయనుగా.. ఒక్క అరగంట.. మీరు మనస్ఫూర్తిగా చెబితే వస్తా.. నాకు 2005లో పెళ్లి అయిన తర్వాత నేను ఎవరి దగ్గరకు రాలే.. నీతో ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకు తెలియదు. అలా జరిగిపోయింది. ఇన్ని సార్లు అడుగుతున్నా.. బతిమాలుతున్నా.. ఏమంటారు.. హలో రావచ్చా...’ ఒక కాల్‌మనీ ఆగంతకుడు ఓ మహిళను తన లైంగిక కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేస్తూ ఇటీవల ఫోన్లో సంభాషించిన తీరు ఇది.. విజయవాడ నగరవాసులను కాటేస్తున్న ‘కాల్ నాగుల’ దందాలపై నాలుగేళ్ల క్రితమే ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చినా.. అప్పటి ప్రభుత్వం, పోలీసు అధికారులు నిర్లిప్తత కారణంగా నేటికీ వారు రెచ్చిపోతూనే ఉన్నారు. అప్పుడు కేవలం కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై దృష్టి పెట్టిన పోలీసులు.. కలుగులో దాక్కున్న చాలా ఎలుకలను వదిలేయడంతో ఇప్పుడా కాలాంతకులు మళ్లీ మహిళలను చెరపట్టే స్థాయికి చేరుకున్నారు. సాక్షి, అమరావతి : కాల్‌మనీ రాకెట్ పుట్ట పగులుతోంది. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో మొరపెట్టుకుంటున్న బాధితుల వ్యథలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో అనేక మంది కమిషనరేట్ తలుపు తడుతున్నారు. గత రెండు నెల రోజుల్లో పోలీసు కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో కాల్‌మనీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అప్పు ఇచ్చిన సొమ్ముకు అధిక వడ్డీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండటం.. తమ కోరికలు తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో బాధితులు వెలుగులోకి వస్తున్నారు. పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని వేడుకుంటున్నారు. నగరంలో ఇలాంటి కేసులు నిత్యం వందలాదిగా బయటపడుతుంటే అతి కొద్ది కేసులు మాత్రమే పోలీసుల వరకు వస్తున్నాయి. పేదలను పీల్చేస్తున్న పిశాచాలు.. కానూరుకు చెందిన ఓ మహిళ కుటుంబ అవసరాల నిమిత్తం స్థానికుడైన వంగర సుబ్రహ్మణ్యం వద్ద రూ.10.లక్షల అప్పు తీసుకుంది. ఆమెపైనే కన్నేసిన సుబ్రహ్మణ్యం.. ఇచ్చిన అప్పునకు బదులుగా కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు. కొడుకును కనిస్తేనే ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బంగారం తిరిగిస్తానని బెదిరించాడు. ఇది తట్టుకోలేక ఆమె పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. చివరకు సుబ్రహ్మణ్యంపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాడవపేటకు చెందిన వెంకటరమణ అనే మహిళ కూడా తన కుటుంబ అవసరాల కోసం రెబ్బా శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద రూ.3ల వడ్డీకి రూ.50వేలు అప్పు తీసుకుంది. 5 నెలల తర్వాత అసలు, వడ్డీ చెల్లించినా సదరు మహిళ ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, చెక్కు ఇవ్వలేదు. అదేమంటే అసలు వడ్డీనే చెల్లించలేదని, రూ.15ల వడ్డీకి అప్పు ఇచ్చానని బెదిరించాడు. ఇంట్లో ఉన్న టీవీని సైతం తీసుకుపోయాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. రామవరప్పాడుకు చెందిన వడ్డీ వ్యాపారి బొప్పన చంద్రశేఖర్ తన వద్ద అప్పు తీసుకున్న చాగంటి ప్రసాద్‌కు చెందిన భవనంపై కన్నేశాడు. చాగంటి ప్రసాద్ తీసుకున్న అప్పునకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించేశాడు. అయితే ఇంకా చెల్లించాలని చెప్పి రామవరప్పాడులో ఉన్న ఇతని భవనాన్ని తన పేరున రాయించుకునేందుకు చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నాడని ప్రసాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులను ఒత్తిడికి గురిచేస్తున్న పోలీసులు..! కాల్‌మనీ వ్యాపారుల వల్ల ఇబ్బందులు పడిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే.. భరోసా ఇవ్వాల్సింది పోయి వడ్డీ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు వారాల క్రితం వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ మహిళ జంగా రవి అనే వడ్డీ వ్యాపారి ‘తన కోరిక తీర్చాలని.. ఇంటికి రావచ్చా..’ అంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఈ నెల 16వ తేదీన ‘స్పందన’ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ ఎదుట ఫిర్యాదు చేసింది. ఈ కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ అప్పగించారు. విచారించిన పోలీసులు 2వ పట్టణ పోలీసులకు కేసు కట్టమని ఆదేశించారు. 22వ తేదీన 2వ పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ 345(ఏ), 506 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు కట్టారు. మరుసటి రోజు బాధితురాలిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి నుంచి రోజూ ఎస్ఐ ఆమెకు ఫోన్ చేసి నిందితుడి వివరాలు అడగడం.. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పడం పరిపాటిగా మారింది. చివరకు నిందితుడు కోర్టులో లొంగిపోయి ఈనెల 26న బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. అయినా ఎస్ఐ బాధితురాలితో నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని బుకాయిస్తున్నారు. బెయిల్ పొందిన తరువాత కోర్టు నుంచి సమాచారం వస్తుంది. దానిని కూడా దాచిపెట్టి బాధితురాలిని పోలీసులు మభ్యపెట్టడం గమనార్హం. -
అనంతలో కాల్‌మనీ కలకలం
► అప్పు కట్టలేదని టీడీపీ నేత దాడి ► మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య శింగనమల: అప్పు కట్టలేదని టీడీపీ నాయకుడు దాడి చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే...అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన బోయ జయరాముడు కుమారుడు రామాంజినేయులు(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. అదే గ్రామ సర్పంచ్ సుబ్బమ్మ భర్త, టీడీపీ నాయకుడు గోరంట్ల అనంతయ్య వడ్డీ వ్యాపారం చేస్తుండటంతో పాటు చీటీలు నడుపుతుంటాడు. బోయ రామాంజినేయులు రెండేళ్ల క్రితం అనంతయ్య వద్ద రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. గత ఏడాది అతని భార్య రోడ్డు ప్రమాదంలో వృుతి చెందడం, ఆర్థిక ఇబ్బందులు ఆధికం కావడంతో అప్పు కట్టలేకపోయాడు. దీంతో మంగళవారం ఉదయం అనంతయ్య తన ఇంటి వద్దకు రామాంజినేయులును పిలిపించి కొట్టడంతో పాటు నానా దుర్భాషలాడాడు. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన రామాంజినేయులు ఇంట్లోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి రెండేళ్ల కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. -
హైదరాబాద్‌లోనూ ‘కాల్ మనీ’ దందా
-
హైదరాబాద్‌లోనూ ‘కాల్ మనీ’ దందా
► అక్రమ వడ్డీ వ్యాపారుల భరతం పట్టిన దక్షిణ మండలం పోలీసులు ► వేధింపులకు పాల్పడితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి: డీసీపీ హైదరాబాద్: పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఉన్న కొద్దిపాటి ఆస్తులను జీపీఏ, ఎస్పీఏ చేయించుకొని రుణాలిస్తున్న ఘరానా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు దక్షిణ మండల పోలీసులు చెక్ పెట్టారు. డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో 25 టీమ్‌లు పాతబస్తీలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 56 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. పురానీహవేలీలోని తన కార్యాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. పాతబస్తీలోని వడ్డీ వ్యాపారులపై ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు చేసి దందాలను మూయించడం జరిగిందన్నారు. నలుగురిపై పి.డి. యాక్ట్‌లు కూడా ప్రయోగించామన్నారు. వడ్డీ వ్యాపారులు కొత్త పంథాలో పేదల ఆస్తులను తమ పేర్లపై జీపీఏ చేయించుకొని 40-50 శాతం వడ్డీకి రుణాలిస్తున్నారన్నారు. రెండు మూడు నెలల్లో నే ఆస్తులను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని పేదలను రోడ్డున పడేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలపై సమాచారం అందడంతో పాతబస్తీ అంతటా దాడులు నిర్వహించినట్లు చెప్పారు. మొత్తం 56 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఫైనాన్స్ బుక్‌లు, రికార్డ్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో 30 మందిపై గతంలోనే కేసులు నమోదైనట్లు తేలిందన్నారు. ఎక్కువ కేసులు నమోదైన వారిపై పి.డి. యాక్ట్‌లు ప్రయోగిస్తామన్నారు. వివరాలను పూర్తిగా పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. పాత నగరంలో మరో వారం రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగిస్తామన్నారు. పట్టుబడిన వారిలో రౌడీషీటర్లు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు చెప్పారు. వడ్డీ వ్యాపారుల్లో ఒక మహిళ కూడా ఉండడం గమనార్హం. ఈ సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్‌ల ఏసీపీలు అశోక చక్రవర్తి, శ్రీనివాసరావు, వి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నిర్భయంగా ఫిర్యాదు చేయండి.... పాతబస్తీలో ఫైనాన్సర్లు వేధింపులకు గురిచేసినా, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా.. ఎలాంటి భయం లేకుండా తమకు ఫిర్యాదు చేయాలని డీసీపీ సత్యనారాయణ బాధితులకు సూచించారు. స్థానిక స్టేషన్లలో గాని, నేరుగా తనకు(9490616476) ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. -
కాల్‌మనీ.. కాదు అంబేద్కర్
-
కాల్‌మనీ.. కాదు అంబేద్కర్
కాల్‌మనీ - సెక్స్ రాకెట్ అంశం మీద చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అసెంబ్లీ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత వైఎస్ఆర్సీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముందు కాల్‌మనీ - సెక్స్ రాకెట్ అంశంపై చర్చ సాగించాలని కోరారు. మిగిలిన అంశాలు ఏవైనా ఆ తర్వాత చర్చించుకోవచ్చని సూచించారు. ఇంతకంటే ప్రధానమైన అంశం ఏమీ లేదని అన్నారు. అయితే, అందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిరాకరించారు. నిన్నటి ఎజెండాలో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ అంశం మీద చర్చను ముందుగా చేపట్టాలని, అది పూర్తయిన తర్వాతే మరే అంశాన్నైనా చేపట్టుకోవచ్చని తెలిపారు. దానికి వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అయినా అధికారపక్షం మాత్రం తమ పట్టు వీడకుండా ముందుగా అంబేద్కర్ అంశం మీద చర్చను ప్రారంభించింది. -
ఆ రోజుల్లో ఎప్పుడూ గుర్తురాలేదా?
-
ఆ రోజుల్లో ఎప్పుడూ గుర్తురాలేదా?
చంద్రబాబు తన నీచ రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌ను కూడా వాడుకున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయల్దేరారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజ్యాంగ ఆమోద దినాన్ని కూడా కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిందని చెబుతున్నారు. అసెంబ్లీని ఐదు రోజుల పాటే నిర్వహిస్తూ దాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని ఊరుకోబోమని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను పొడిగించి.. ఐదు రోజుల పాటు అంబేద్కర్ మీద చర్చ జరపాలని, మిగిలిన కాలాన్ని కాల్‌మనీ సెక్స్ రాకెట్ మీద చర్చించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. అంబేద్కర్ వద్దకు వచ్చి, ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి, చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ను సైతం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే తీరును వ్యతిరేకించాం. ఆయనకు నివాళులు అర్పించాం. ఎంత హేయమైన పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ ఉందంటే, మొత్తం రాష్ట్రం తలదించుకునేలా విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తోంది. విజయవాడలో అధిక వడ్డీకి ఆడవాళ్లకు డబ్బులిచ్చి, ఆ వడ్డీలు కట్టలేని ఆడవాళ్లు, పేదవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే అధ్వాన పరిస్థితి విజయవాడలో జరుగుతోంది. ఆడాళ్లను అశ్లీలంగా వీడియో టేపులు తీసి, వాళ్లను శాశ్వతంగా వ్యభిచారంలో ముంచేసేలా చేస్తున్నారు. ఈ నేరంలో సాక్షాత్తు చంద్రబాబు దగ్గర్నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరికీ భాగస్వామ్యం ఉంది. వాళ్లంతా దోషులుగా నిలబడాలి. కానీ చంద్రబాబు నిన్న అసెంబ్లీలో హేయంగా ప్రవర్తించారు. ఈ టాపిక్ బయటకు రాకూడదన్న ఉద్దేశంతో, ఎజెండాలో లేకపోయినా రెండోసారి సభ వాయిదా పడినప్పుడు సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. అసెంబ్లీ జరిగేది ఐదు రోజులు, అదికూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. ఈ ఐదు రోజుల్లో సెక్స్ రాకెట్ మీద చర్చించాలన్న ఆలోచన లేదు. చివరకు అంబేద్కర్‌ను కూడా వదల్లేదు నిజానికి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న, వర్ధంతి డిసెంబర్ 6న. ఆయన అధ్యక్షత వహిచంఇన రాజ్యాంగ సంఘం తొలి సమావేశం డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ రచన పూర్తి చేసింది నవంబర్ 26న చంద్రబాబుకు ఈ తేదీలలో ఎప్పుడూ అంబేద్కర్ గుర్తురాలేదు. అప్పుడు నివాళులు అర్పించాలని అనుకోలేదు డిసెంబర్ 17న ఏమీ లేనప్పుడు మాత్రం అసెంబ్లీలో అంబేద్కర్ గురించి చర్చిస్తామంటారు ఇప్పుడు కూడా ఆయన ఏంచేయబోతున్నాడు, అసెంబ్లీలో ప్రకటన ఇస్తాడట. అది ఇంకా దారుణం. స్టేట్మెంట్కు, చర్చకు చిన్న తేడా ఉంది. సీఎం స్టేట్మెంట్ ఇస్తే, ఇక చర్చ జరగదు. ప్రకటన మీద రెండు మూడు నిమిషాలు స్పష్టత ఇస్తారు ఆయన ఇచ్చే ప్రకటన కూడా విజయవాడ అంశాన్ని దారి మళ్లించేందుకే. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయిస్తున్నాడు ఇదేదో సాదాసీదా వడ్డీ వ్యాపారంగా చిత్రీకరించి, సెక్స్ రాకెట్లో తాను, తనవాళ్లను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సెక్స్ రాకెట్ చర్చను దారి మళ్లించేందుకు అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ విన్నపం చేస్తున్నా చంద్రబాబు వల్ల ఎక్కడా రూపాయి అప్పు పుట్టడంలేదు సున్నా వడ్డీకి అప్పులు దొరకట్లేదు అధికవడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. అలా అప్పు తీసుకున్న ఆడాళ్లను వేశ్యవృత్తిలోకి దించుతున్న ఈ రాకెట్‌ను మనంతా కలిసి అడ్డుకోవాలి. లేకపోతే ఈ వ్యవస్థ ఇక బాగుపడదు. అంతా కలిసి ఒక్కటవుదాం. చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ చట్టం ముందుకు తీసుకొద్దాం ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి అయినా సరే అంబేద్కర్ మీద చర్చ జరపాలని కోరినందుకు ఆయనకే విన్నవించుకుంటున్నాం మీరు పోయిన తర్వాత ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో చూడాలని కోరాం పేద మహిళల కోసం మేం పోరాటం చేస్తుంటే, దానిపై చర్చ జరగనివ్వకుండా, అంబేద్కర్‌ను తెరమీదకు తెచ్చారు. ఆయన వైఖరికి దేవుడు, ప్రజలు బుద్ధి చెబుతారు. -
కాల్‌మనీ ముఠాలో మరో టీడీపీ నేత
-
కాల్‌మనీ ముఠాలో మరో టీడీపీ నేత
కాల్‌మనీ ముఠా విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ పాత్ర ఇందులో బయటపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ కనకదుర్గ, ఆమె భర్త కొండ తమను వేధిస్తున్నారంటూ కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కార్పొరేటర్ కనకదుర్గ, కొండ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.