
ఆ రోజుల్లో ఎప్పుడూ గుర్తురాలేదా?
చంద్రబాబు తన నీచ రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌ను కూడా వాడుకున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయల్దేరారు.
ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజ్యాంగ ఆమోద దినాన్ని కూడా కేవలం వైఎస్ఆర్‌సీపీ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిందని చెబుతున్నారు. అసెంబ్లీని ఐదు రోజుల పాటే నిర్వహిస్తూ దాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని ఊరుకోబోమని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను పొడిగించి.. ఐదు రోజుల పాటు అంబేద్కర్ మీద చర్చ జరపాలని, మిగిలిన కాలాన్ని కాల్‌మనీ సెక్స్ రాకెట్ మీద చర్చించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
- అంబేద్కర్ వద్దకు వచ్చి, ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి, చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ను సైతం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే తీరును వ్యతిరేకించాం.
- ఆయనకు నివాళులు అర్పించాం.
- ఎంత హేయమైన పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ ఉందంటే, మొత్తం రాష్ట్రం తలదించుకునేలా విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తోంది.
- విజయవాడలో అధిక వడ్డీకి ఆడవాళ్లకు డబ్బులిచ్చి, ఆ వడ్డీలు కట్టలేని ఆడవాళ్లు, పేదవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే అధ్వాన పరిస్థితి విజయవాడలో జరుగుతోంది.
- ఆడాళ్లను అశ్లీలంగా వీడియో టేపులు తీసి, వాళ్లను శాశ్వతంగా వ్యభిచారంలో ముంచేసేలా చేస్తున్నారు.
- ఈ నేరంలో సాక్షాత్తు చంద్రబాబు దగ్గర్నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరికీ భాగస్వామ్యం ఉంది.
- వాళ్లంతా దోషులుగా నిలబడాలి.
- కానీ చంద్రబాబు నిన్న అసెంబ్లీలో హేయంగా ప్రవర్తించారు.
- ఈ టాపిక్ బయటకు రాకూడదన్న ఉద్దేశంతో, ఎజెండాలో లేకపోయినా రెండోసారి సభ వాయిదా పడినప్పుడు సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు.
- అసెంబ్లీ జరిగేది ఐదు రోజులు, అదికూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. ఈ ఐదు రోజుల్లో సెక్స్ రాకెట్ మీద చర్చించాలన్న ఆలోచన లేదు.
- చివరకు అంబేద్కర్‌ను కూడా వదల్లేదు
- నిజానికి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న, వర్ధంతి డిసెంబర్ 6న.
- ఆయన అధ్యక్షత వహిచంఇన రాజ్యాంగ సంఘం తొలి సమావేశం డిసెంబర్ 9, 1946
- రాజ్యాంగ రచన పూర్తి చేసింది నవంబర్ 26న
- చంద్రబాబుకు ఈ తేదీలలో ఎప్పుడూ అంబేద్కర్ గుర్తురాలేదు. అప్పుడు నివాళులు అర్పించాలని అనుకోలేదు
- డిసెంబర్ 17న ఏమీ లేనప్పుడు మాత్రం అసెంబ్లీలో అంబేద్కర్ గురించి చర్చిస్తామంటారు
- ఇప్పుడు కూడా ఆయన ఏంచేయబోతున్నాడు, అసెంబ్లీలో ప్రకటన ఇస్తాడట. అది ఇంకా దారుణం.
- స్టేట్‌మెంట్‌కు, చర్చకు చిన్న తేడా ఉంది. సీఎం స్టేట్‌మెంట్ ఇస్తే, ఇక చర్చ జరగదు. ప్రకటన మీద రెండు మూడు నిమిషాలు స్పష్టత ఇస్తారు
- ఆయన ఇచ్చే ప్రకటన కూడా విజయవాడ అంశాన్ని దారి మళ్లించేందుకే.
- అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయిస్తున్నాడు
- ఇదేదో సాదాసీదా వడ్డీ వ్యాపారంగా చిత్రీకరించి, సెక్స్ రాకెట్‌లో తాను, తనవాళ్లను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
- సెక్స్ రాకెట్ చర్చను దారి మళ్లించేందుకు అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు
- రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ విన్నపం చేస్తున్నా
- చంద్రబాబు వల్ల ఎక్కడా రూపాయి అప్పు పుట్టడంలేదు
- సున్నా వడ్డీకి అప్పులు దొరకట్లేదు
- అధికవడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది.
- అలా అప్పు తీసుకున్న ఆడాళ్లను వేశ్యవృత్తిలోకి దించుతున్న ఈ రాకెట్‌ను మనంతా కలిసి అడ్డుకోవాలి.
- లేకపోతే ఈ వ్యవస్థ ఇక బాగుపడదు. అంతా కలిసి ఒక్కటవుదాం.
- చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ చట్టం ముందుకు తీసుకొద్దాం
- ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి అయినా సరే అంబేద్కర్ మీద చర్చ జరపాలని కోరినందుకు ఆయనకే విన్నవించుకుంటున్నాం
- మీరు పోయిన తర్వాత ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో చూడాలని కోరాం
- పేద మహిళల కోసం మేం పోరాటం చేస్తుంటే, దానిపై చర్చ జరగనివ్వకుండా, అంబేద్కర్‌ను తెరమీదకు తెచ్చారు.
- ఆయన వైఖరికి దేవుడు, ప్రజలు బుద్ధి చెబుతారు.