milk bath
-
‘కేసీఆర్ సారూ.. మీరు సల్లగుండాలె’.. బార్ ఓనర్ల అభిషేకం వైరల్
మహబూబాబాద్: కృతజ్ఞతను ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్లైల్. తమకున్నంతలో కొందరు చేస్తే.. ఇంకొందరు మాత్రం అతికి పోతుంటారు. అయితే ఇక్కడ మాత్రం కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పట్ల తమ కృతజ్ఞతను ప్రత్యేకంగా చాటుకున్నారు. జిల్లాలోని మానుకోటలో బార్ షాప్ యాజమానులు వినూత్నంగా సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ తెలియజేసుకున్నారు. బార్ షాపుల్లో 90 ఎం.ఎల్, క్వార్టర్, ఆఫ్ బాటిళ్లకు అనుమతి ఇవ్వడంతో.. ఇలా కేసీఆర్ ఫొటో ముందు మందు బాటిళ్లు ఉంచి దణ్ణం పెట్టారు. కేసీఆర్ చల్లగా ఉండాలంటూ కోరుకున్నారు. ఆపై ఫొటోకు పాలాభిషేకం చేశారు బార్ యజమానులు. ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. -
ముఖేష్ ఉపాధ్యాయ కు పాలతో స్నానం
-
మురికి కాల్వలో దూకిన కౌన్సిలర్.. వెంటనే పాలాభిషేకం.. ఎందుకో తెలుసా..?
సాక్షి, న్యూఢిల్లీ: సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ విలన్లను ఊచకోత కోస్తాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్టీఆర్‌కు పాలాభిషేకం చేస్తారు. ఇదే తరహాలో ఓ కౌన్సిలర్ చేసిన పనికి ప్రజలు ఫిదా అయిపోయి ఆయనకు పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా కౌన్సిలర్.. ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలో మున్సిపల్ కార్మికులు మురికి కాలువను శుభ్రం చేయడంలేదని ఆ ప్రాంత కౌన్సిలర్‌కు వినతి పత్రాలు అందాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్.. శాస్త్రి పార్క్‌లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. అనంతరం కాలువలోని చెత్తను తొలగించారు. AAP councilor Haseeb-ul-Hasan jumps in drain during mission clean up, then milk bath much in the style of actor Anil Kapoor in the Bollywood blockbuster “Nayak”. Watch the #ViralVideo. (Video by @PankajJainClick) #AAP #Drain #MilkBath pic.twitter.com/bkBAi5PyEB — IndiaToday (@IndiaToday) March 22, 2022 ఈ సందర్భంగానే ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని హసీబ్ చెప్పడం గమనార్హం. కాలువలోని చెత్తను తొలగించిన అనంతరం ఆ ప్రాంతంలోని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను కూర్చోబెట్టి పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్ స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల స్టంట్లు మొదలయ్యాయంటూ కామెంట్స్ చేశాడు. -
మధుసూదనాచారిపై సోషల్ మీడియాలో సెటైర్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా ఆయన పాలాభిషేకం వీడియో ఒకటి నెట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధి అయివుండి ఇలాంటి పనులను ప్రొత్సహించటమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పాలను వృధా చేశారు. తెలంగాణలో కనీసం వాటిని కొనలేని ప్రజలు ఉన్నారని గుర్తించండి’ అని కొందరు.. ‘సాధారణంగా సినిమా వాళ్లకు కటౌట్లకు ఇలాంటి పాలాభిషేకం చూస్తుంటాం. కానీ, ఇప్పుడది వేరే మలుపు తీసుకున్నట్లుంది’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఓ మెట్టుదిగి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కొత్తగా గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతగా తన నియోజకవర్గం భూపాలపల్లిలోని పెద్దపల్లి గ్రామంలో అనుచరులు మధుసూదనాచారికి పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే. Damn.... is it this hard to see the wastage.... Ironic making a fool out of themselves on April Fool's day... — Manisha Palai (@manishapalai) 1 April 2018 What a wastage of milk! You do realize Telangana has a lot of people who actually don't have money to afford it. — Dr. Sugandha (@sugandhakohli) 1 April 2018 -
కేసీఆర్, హరీశ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
సిద్దిపేట: ‘‘దశాబ్ద కాలం క్రితం అసైన్డ్ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాం.. పట్టాలు లేక ఇబ్బంది పడ్డాం.. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి.. మా లాంటి పేదల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు.. ఆయన చలవతో మేము సొంతింటి వాళ్లమయ్యాం.. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం.. అని సిద్దిపేటకు చెందిన పలువురు పేర్కొన్నారు. పట్టణ శివారులోని 1,340 సర్వేనంబర్‌లో గల అసైన్డ్ భూముల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా కాలంగా నివాసం ఉన్నా ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందని భయాందోళన చెందారు. అయితే సీఎం కేసీఆర్ ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం పలువురి పాలిట వరంగా మారింది. సోమవారం మంత్రి హరీశ్‌రావు అసైన్డ్ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి పట్టాలు పంపిణీ చేశారు. దీంతో వారు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంపత్‌రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు శివారులోని చైతన్యపూరి తోపాటు పలు కాలనీల ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించడం సంతోషంగా ఉందన్నారు. హక్కుదారులుగా పత్రాలు తమ జీవితాల్లో ఆనందం నింపాయని, ఈ రోజు మాకు పండుగని పలువురు పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు, జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. -
ఆ రోజుల్లో ఎప్పుడూ గుర్తురాలేదా?
-
ఆ రోజుల్లో ఎప్పుడూ గుర్తురాలేదా?
చంద్రబాబు తన నీచ రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌ను కూడా వాడుకున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయల్దేరారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజ్యాంగ ఆమోద దినాన్ని కూడా కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిందని చెబుతున్నారు. అసెంబ్లీని ఐదు రోజుల పాటే నిర్వహిస్తూ దాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని ఊరుకోబోమని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను పొడిగించి.. ఐదు రోజుల పాటు అంబేద్కర్ మీద చర్చ జరపాలని, మిగిలిన కాలాన్ని కాల్‌మనీ సెక్స్ రాకెట్ మీద చర్చించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. అంబేద్కర్ వద్దకు వచ్చి, ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి, చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ను సైతం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే తీరును వ్యతిరేకించాం. ఆయనకు నివాళులు అర్పించాం. ఎంత హేయమైన పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ ఉందంటే, మొత్తం రాష్ట్రం తలదించుకునేలా విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తోంది. విజయవాడలో అధిక వడ్డీకి ఆడవాళ్లకు డబ్బులిచ్చి, ఆ వడ్డీలు కట్టలేని ఆడవాళ్లు, పేదవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే అధ్వాన పరిస్థితి విజయవాడలో జరుగుతోంది. ఆడాళ్లను అశ్లీలంగా వీడియో టేపులు తీసి, వాళ్లను శాశ్వతంగా వ్యభిచారంలో ముంచేసేలా చేస్తున్నారు. ఈ నేరంలో సాక్షాత్తు చంద్రబాబు దగ్గర్నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరికీ భాగస్వామ్యం ఉంది. వాళ్లంతా దోషులుగా నిలబడాలి. కానీ చంద్రబాబు నిన్న అసెంబ్లీలో హేయంగా ప్రవర్తించారు. ఈ టాపిక్ బయటకు రాకూడదన్న ఉద్దేశంతో, ఎజెండాలో లేకపోయినా రెండోసారి సభ వాయిదా పడినప్పుడు సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. అసెంబ్లీ జరిగేది ఐదు రోజులు, అదికూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. ఈ ఐదు రోజుల్లో సెక్స్ రాకెట్ మీద చర్చించాలన్న ఆలోచన లేదు. చివరకు అంబేద్కర్‌ను కూడా వదల్లేదు నిజానికి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న, వర్ధంతి డిసెంబర్ 6న. ఆయన అధ్యక్షత వహిచంఇన రాజ్యాంగ సంఘం తొలి సమావేశం డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ రచన పూర్తి చేసింది నవంబర్ 26న చంద్రబాబుకు ఈ తేదీలలో ఎప్పుడూ అంబేద్కర్ గుర్తురాలేదు. అప్పుడు నివాళులు అర్పించాలని అనుకోలేదు డిసెంబర్ 17న ఏమీ లేనప్పుడు మాత్రం అసెంబ్లీలో అంబేద్కర్ గురించి చర్చిస్తామంటారు ఇప్పుడు కూడా ఆయన ఏంచేయబోతున్నాడు, అసెంబ్లీలో ప్రకటన ఇస్తాడట. అది ఇంకా దారుణం. స్టేట్మెంట్కు, చర్చకు చిన్న తేడా ఉంది. సీఎం స్టేట్మెంట్ ఇస్తే, ఇక చర్చ జరగదు. ప్రకటన మీద రెండు మూడు నిమిషాలు స్పష్టత ఇస్తారు ఆయన ఇచ్చే ప్రకటన కూడా విజయవాడ అంశాన్ని దారి మళ్లించేందుకే. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయిస్తున్నాడు ఇదేదో సాదాసీదా వడ్డీ వ్యాపారంగా చిత్రీకరించి, సెక్స్ రాకెట్లో తాను, తనవాళ్లను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సెక్స్ రాకెట్ చర్చను దారి మళ్లించేందుకు అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ విన్నపం చేస్తున్నా చంద్రబాబు వల్ల ఎక్కడా రూపాయి అప్పు పుట్టడంలేదు సున్నా వడ్డీకి అప్పులు దొరకట్లేదు అధికవడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. అలా అప్పు తీసుకున్న ఆడాళ్లను వేశ్యవృత్తిలోకి దించుతున్న ఈ రాకెట్‌ను మనంతా కలిసి అడ్డుకోవాలి. లేకపోతే ఈ వ్యవస్థ ఇక బాగుపడదు. అంతా కలిసి ఒక్కటవుదాం. చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ చట్టం ముందుకు తీసుకొద్దాం ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి అయినా సరే అంబేద్కర్ మీద చర్చ జరపాలని కోరినందుకు ఆయనకే విన్నవించుకుంటున్నాం మీరు పోయిన తర్వాత ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో చూడాలని కోరాం పేద మహిళల కోసం మేం పోరాటం చేస్తుంటే, దానిపై చర్చ జరగనివ్వకుండా, అంబేద్కర్‌ను తెరమీదకు తెచ్చారు. ఆయన వైఖరికి దేవుడు, ప్రజలు బుద్ధి చెబుతారు. -
మహారాష్ట్ర మంత్రికి క్షీరాభిషేకం
ముంబై: సొంత పార్టీ కార్యకర్త నుంచి సిరా దాడిని ఎదుర్కొన్న మహారాష్ట్ర కార్మిక మంత్రి హసన్ ముష్రిఫ్‌కు ఎన్సీపీ కార్యకర్తలు క్షీరాభిషేకంతో ‘శుద్ధి’ చేశారు. ఈ సంఘటన కొల్హాపూర్‌లో శుక్రవారం జరిగింది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా చట్టం తెచ్చిన మహారాష్ట్రలో ఈ సంఘటన జరగడం ఆశ్చర్యకరం. సిరా దాడి తర్వాత మంత్రికి క్షీరాభిషేకంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి ముష్రిఫ్ తన మద్దతుదారుల చర్యకు ఆదివారం క్షమాపణలు చెప్పుకున్నారు. వారేం చేయబోయేదీ ముందుగానే తనకు తెలిసి ఉంటే వారించేవాడినని ఆయన అన్నారు. బుల్ధానా ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమానికి మంత్రి ముష్రిఫ్ హాజరయ్యారు. సభా వేదిక వద్దకు ఆయన వెళుతుండగా, నామ్‌దేవ్ డోంగార్దివే అనే కార్యకర్త అకస్మాత్తుగా ఆయనపై సిరా చల్లాడు. మిగిలిన కార్యకర్తలు అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. సంఘటన జరిగిన మర్నాడు మంత్రి ముష్రిఫ్ కొల్హాపూర్‌లో ఏర్పాటైన కార్యకర్తల సమావేశానికి హాజరు కాగా, ఆయన మద్దతుదారులు ఆయనను ఒక కుర్చీలో ప్రత్యేకంగా కూర్చోబెట్టి, క్షీరాభిషేకం చేశారు.