మహబూబాబాద్: కృతజ్ఞతను ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్లైల్. తమకున్నంతలో కొందరు చేస్తే.. ఇంకొందరు మాత్రం అతికి పోతుంటారు. అయితే ఇక్కడ మాత్రం కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పట్ల తమ కృతజ్ఞతను ప్రత్యేకంగా చాటుకున్నారు.
జిల్లాలోని మానుకోటలో బార్ షాప్ యాజమానులు వినూత్నంగా సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ తెలియజేసుకున్నారు. బార్ షాపుల్లో 90 ఎం.ఎల్, క్వార్టర్, ఆఫ్ బాటిళ్లకు అనుమతి ఇవ్వడంతో.. ఇలా కేసీఆర్ ఫొటో ముందు మందు బాటిళ్లు ఉంచి దణ్ణం పెట్టారు. కేసీఆర్ చల్లగా ఉండాలంటూ కోరుకున్నారు. ఆపై ఫొటోకు పాలాభిషేకం చేశారు బార్ యజమానులు. ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment