Bar owners
-
‘కేసీఆర్ సారూ.. మీరు సల్లగుండాలె’.. బార్ ఓనర్ల అభిషేకం వైరల్
మహబూబాబాద్: కృతజ్ఞతను ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్లైల్. తమకున్నంతలో కొందరు చేస్తే.. ఇంకొందరు మాత్రం అతికి పోతుంటారు. అయితే ఇక్కడ మాత్రం కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పట్ల తమ కృతజ్ఞతను ప్రత్యేకంగా చాటుకున్నారు. జిల్లాలోని మానుకోటలో బార్ షాప్ యాజమానులు వినూత్నంగా సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ తెలియజేసుకున్నారు. బార్ షాపుల్లో 90 ఎం.ఎల్, క్వార్టర్, ఆఫ్ బాటిళ్లకు అనుమతి ఇవ్వడంతో.. ఇలా కేసీఆర్ ఫొటో ముందు మందు బాటిళ్లు ఉంచి దణ్ణం పెట్టారు. కేసీఆర్ చల్లగా ఉండాలంటూ కోరుకున్నారు. ఆపై ఫొటోకు పాలాభిషేకం చేశారు బార్ యజమానులు. ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. -
సమస్యలు పరిష్కరించండి
శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్): పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రెస్టారెంట్స్ అండ్ బార్ లైసెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.దామోదర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.జైపాల్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు విజయ్‌కు మార్గౌడ్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం సంఘం నాయకులు మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి అసోసియేషన్ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. బార్ లైసెన్స్ 2బీ ఫీజును నాలుగు వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని, ఎంఆర్పీ రౌడింగ్ఆఫ్ను వైన్స్ మాదిరిగా మద్యం కోటాలో కలపకుండా స్టాక్ ఇవ్వాలని కోరారు. జాతీయ రహదారులపై అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న డాబాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్ట్‌షాప్‌లను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కూడా వినతి పత్రాన్ని అందజేశామని సంఘం నాయకులు తెలిపారు. మంత్రిని కలసినవారిలో అసోసియేషన్ గౌరవ సలహాదారు బాలరాజ్‌గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రాజుగౌడ్, శ్రీనివాసగుప్తా తదితరులు ఉన్నారు. -
బార్.. పీటముడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ల వ్యవహారం పీటముడి పడినట్టు కనిపిస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో మూసి వేసిన బార్లను 6 నెలలవు తున్నా తెరిచేందుకు అనుమతించకపోవడంతో లైసెన్స్ ఫీజులు కట్టేందుకు బార్ల యజమానులు విముఖత చూపుతున్నారు. లాక్డౌన్ పేరుతో మూసివేసిన కాలానికి తమకు లైసెన్సు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సమయంలోనే... లైసెన్స్ ఫీజు కట్టాల్సిన గడువు సమీపించడంతో అసలు సమస్య ఏర్పడింది. రాష్ట్రంలోని వెయ్యి బార్ల ప్రస్తుత లైసెన్స్ గడువు ఈ నెలాఖరు వరకు ఉన్నా... 15 రోజుల ముందుగానే ఫీజులు చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చిన అన్‌లాక్–4 మార్గదర్శకాల్లో బార్లను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలోనే బార్లు తెరుస్తారని చర్చ జరిగింది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో అసలు బార్లు ఎప్పుడు తెరుస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న యజమానులు లైసెన్స్ ఫీజులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. లాక్డౌన్ కాలానికి లైసెన్స్ ఫీజు మినహాయించాలనే బార్ యాజమాన్యాల డిమాండ్‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అసలు లైసెన్సు ఫీజులు కట్టాలా వద్దా అనే గందరగోళంలో పడ్డారు రాష్ట్రంలోని బార్ల యజమానులు. సీఎందే తుది నిర్ణయం నిబంధనల ప్రకారం చూసుకుంటే... లైసెన్స్ ఫీజు మినహాయింపు సాధ్యం కాదని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మరోవైపు నిర్దేశిత గడువు ముగిసేలోపు లైసెన్సు ఫీజులు చెల్లించని పక్షంలో... ఆయా లైసెన్సులు రద్దు చేయాలా లేదా కొనసాగించాలా? అనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వారు చెపుతున్నారు. ఫీజు కట్టకపోతే ప్రస్తుతమున్న లైసెన్సు సందిగ్ధంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. కానీ బార్ యజమానులు మాత్రం అసలే నష్టాల్లో ఉన్న తమను కరోనా మరింత నష్టాల్లోకి నెట్టిందని, ఈ పరిస్థితుల్లో లక్షల రూపాయల లైసెన్సు ఫీజులు తాము చెల్లించలేమని అంటున్నారు. యాజమాన్యాల అసోసియేషన్ కూడా ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. లైసెన్స్ ఫీజు మినహాయింపులో కానీ, బార్లు తెరిచే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ బార్ల యజమానుల్లోనూ, ఎక్సైజ్ వర్గాల్లోనూ కనిపిస్తోంది. మరి, ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు, ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే...! -
బార్ వ్యాపారులే సూత్రధారులు...!
తెనాలి: తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో సూత్రధారులు మిస్సయ్యారు. కేవలం పాత్రధారులనే అరెస్టు చేయగలిగారని ఇక్కడి మద్యం వ్యాపార వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. పట్టణంలో ఇంతకు పూర్వం రెండు బార్ అండ్ రెస్టారెంట్లను నడిపిన వ్యాపారులే సిండికేట్‌గా మారి, అక్రమ వ్యాపారానికి తెరతీశారు. ఇందుకు స్థానిక ఎక్సైజ్ శాఖలోని ఓ అధికారి పరోక్ష సహకారం ఉందనే ఆరోపణలున్నాయి. సిండికేట్‌లోని ఒకరు, అధికారిక వ్యాపారంలోని ప్రత్యర్థితో రెండురోజుల క్రితమే సున్నం పెట్టుకున్నాడు. ఇందుకు కక్ష గట్టిన ఆ వ్యాపారి సిండికేట్ కదలికలపై నిఘా వుంచి, అక్రమ మద్యం తరలింపుపై పక్కా సమాచారాన్ని చేరవేసినట్టు విశ్వసనీయ సమాచారం. వెలుగులోకి రాని బడా వ్యాపారులు.... తెనాలి డివిజనులో రెండేళ్ల క్రితం అక్రమ మద్యంపై కేసుల నమోదు విషయం గుర్తుండే వుంటుంది. సొంతంగా తయారుచేసిన మద్యాన్ని బాటిల్స్‌లో నింపటం, ఖరీదైన లిక్కరు బాటిళ్లలో చౌకమద్యాన్ని/ నీటిని నింపి కొత్త మూతలతో సీలు వేసి, చేస్తున్న అమ్మకం గుట్టు బహిర్గతమైంది. పట్టణంలో వీటి వెనుకనున్న బడా వ్యాపారులు వెలుగులోకి రాలేదు. తాజాగా పట్టుబడిన కేసులోనూ ఈ తరహాలోనే అసలు సూత్రధారులు అండర్‌గ్రౌండ్‌లోనే ఉండిపోయారన్న చర్చ నడుస్తోంది. మద్యం తీసుకొస్తున్న వాహనాలకు ఎస్కార్ట్‌గా వస్తున్న కారును నిత్యం వాడుతుండే వ్యక్తి మద్యం వ్యాపారిగా పట్టణంలో అందరికీ చిరపరిచితుడు. స్వస్థలం సమీపంలోని అమృతలూరు మండలంలోని ఓ గ్రామం. అలాగే తెనాలికి దగ్గర్లోని మరో గ్రామానికి చెందిన వ్యాపారి, మరో ఇద్దరు ముగ్గురుతో కలసి పట్టణంలోని రెండు బార్ అండ్ రెస్టారెంట్లను నిర్వహిస్తూ వచ్చారు. లాక్‌డౌన్‌తో బార్లు మూతపడగా, తెలంగాణ నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యంతో లాభాల వేటకు దిగారు. ఒక్కో క్వార్టరు బాటిల్ (180 ఎం.ఎల్)కు అదనంగా రూ.100 పైచిలుకు లాభానికి అమ్ముకునే మార్కెట్ వీరికి అభయమిచ్చింది. ఎన్ఫోర్స్మెంట్కు సమాచారం.... తమ సిండికేట్‌తో ఏమాత్రం సంబంధం లేని మరో బార్ అండ్ రెస్టారెంట్ యజమానిని సిండికేట్‌లోని ఒకరు ఇటీవల ఫోను చేసి బెదిరించారు. అకారణంగా బెదిరించటంపై ఆగ్రహించిన ఆయన, స్థానిక టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల హెచ్చరికతో ఆదివారం ఉదయం సారీ చెప్పారు. మరోసారి చేయనని లిఖితపూర్వకంగా రాసిచ్చి బయటపడ్డాడు. సిండికేట్ కార్యకలాపాలపై స్పష్టమైన అవగాహన ఉన్న అదే యజమాని, సూర్యాపేట నుంచి వీరు మద్యం తరలిస్తున్న విషయాన్ని ఆదివారం తెల్లవారుజామున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్‌కు సమాచారమిచ్చారు. ఎస్కార్ట్ వాహనం, సిండికేట్ పేర్లుతో సహా ఇచ్చిన పక్కా సమాచారంతో అక్రమ మద్యం తరలింపును అడ్డుకోగలిగారు. సిండికేట్‌లోని ప్రధాన వ్యాపారి నడిపే కారు, టి.శ్రీకాంత్ అనే పేరుతో ఉన్నందున అతడిని ఈ కేసులో సూత్రధారిగా అరెస్టు చేశారు. దీనితో సిండికేట్‌లోని ప్రధాన సూత్రధారి తప్పించుకున్నారని చెబుతున్నారు. -
ఎదురుచూపులు ఎన్నాళ్లు?
వెంటనేఅనుమతులు ఇవ్వాలంటున్న డ్యాన్స్ బార్ల యజమానులు సాక్షి, ముంబై:రాష్ట్రంలో డ్యాన్స్ బార్లపై విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసి రెండు నెలలు దాటినా ఇంకా అవి తెరుచుకోలేదు. ఒక్క ముంబైలోనే దాదాపు 200 బార్లు పోలీసుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. వెంటనే అనుమతులు ఇవ్వాలని బార్ల యజమానులు కోరుతున్నారు. లేదంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. సుప్రీం తీర్పుతో బార్లలో డ్యాన్సులు చేసే యువతుల్లో, ఇటు యజమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో పునరాలోచనలో పడింది. నిజానికి డ్యాన్స్ బార్లకు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇష్టంలేదు. అయితే సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండడంతో నిషేధాన్ని ఎత్తివేస్తారని అందరూ భావించారు. అయితే నిషేధాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. సందిగ్ధతలో పోలీసులు... రాష్ట్ర పరిపాలనా విభాగం నుంచి ఆదేశాలు వస్తేగానీ బార్ల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని, ఇప్పటిదాకా అటువంటి ఆదేశాలేవీ తమకు అందనందున డ్యాన్స్ బార్ల నిర్వహణకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెబుతున్నారు. అయితే సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేయాల్సి బాధ్యత పోలీసులపై కూడా ఉండడంతో అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే సందిగ్ధంతో పోలీసులున్నారు. అయితే నిషేధాన్ని కొనసాగిస్తామని ఆర్ఆర్ పాటిల్ అసెంబ్లీలో ప్రకటించినా అందుకు సంబంధించి కూడా పరిపాలనా విభాగం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు. అనుమతి ఇవ్వాలా? నిషేధాన్ని కొనసాగించాలా? అనే విషయమై ఎటువంటి స్పష్టత లేదనే విషయాన్ని పోలీసులే అంగీకరిస్తున్నారు. కోర్టుకు వెళ్లే యోచనలో... న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకపోవడమంటే కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బార్ల యజమానులు చెబుతున్నారు. పిటిషన్ వేసేందుకు తాము సిద్ధమవుతున్నామని బార్ యజమానులు చెప్పారు. ఒకవేళ విచారణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ, పోలీసు కమిషనర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.