సాక్షి, గుంటూరు : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటు ఆలస్యంపై మంగళవారం వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. తుళ్లూరు మండలం శాకమూరులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీ ఇచ్చిన హామీని పట్టించుకోనందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు మౌనదీక్షకు సిద్ధమయ్యారు.
ఈ మౌనదీక్షను అడ్డుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మౌనదీక్షకు వెళుతున్న నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాక శాకమూరులో నాగార్జున సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఉద్దండరాయునిపాలెం ఉద్రిక్తత
జిల్లాలోని తుళ్లూరు మండలం ఉద్దండ రాయునిపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాపట్ల పార్లమెంట్ నియోజక వర్గ సమన్వయకర్త సురేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శాకమూరు స్మృతివనం వద్దకు వెళ్లకుండా హోస్ అరెస్టు చేశారు. అంతేకాక తాడికొండ సమన్వయం కర్త క్రిస్టియానాను తెనాలిలో హౌస్ అరెస్టు చేశారు. శాకమూరు స్మృతివనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment