
కాల్‌మనీ ముఠాలో మరో టీడీపీ నేత
కాల్‌మనీ ముఠా విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ పాత్ర ఇందులో బయటపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ కనకదుర్గ, ఆమె భర్త కొండ తమను వేధిస్తున్నారంటూ కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో కార్పొరేటర్ కనకదుర్గ, కొండ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.