'సెక్స్ రాకెట్ ను ప్రోత్సహించినందుకు డాక్టరేట్ ఇచ్చారేమో' | ysrcp leader chevireddy bhaskarreddy fires on ap governement | Sakshi
Sakshi News home page

'సెక్స్ రాకెట్ ను ప్రోత్సహించినందుకు డాక్టరేట్ ఇచ్చారేమో'

Published Fri, Dec 18 2015 9:52 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

'సెక్స్ రాకెట్ ను ప్రోత్సహించినందుకు డాక్టరేట్ ఇచ్చారేమో' - Sakshi

'సెక్స్ రాకెట్ ను ప్రోత్సహించినందుకు డాక్టరేట్ ఇచ్చారేమో'

హైదరాబాద్‌: అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ది చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నీచమైన రాజకీయాలకోసం మహానుభావుడు అంబేద్కర్ ను వాడుకున్న దౌర్బాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబు తప్ప దేశంలో మరొకరు లేరని అన్నారు. అసలు సెక్స్ రాకెట్ ను ప్రోత్సహించినందుకు చంద్రబాబునాయుడికి చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే మొత్తం రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. 'రుణాలు మాఫీ చేయలేదు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మహిళలు అప్పుల పాలయ్యారు.

అందుకే అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు ఆసరగా తీసుకొని మహిళలను అసభ్యంగా చిత్రీకరించారు. వారితో బలవంతంగా వ్యభిచారం చేయించే పరిస్ధితి తీసుకొచ్చారు. మహిళలకు ఇలాంటి దుస్తితి కల్పించడానికి ఎలా మనసు వచ్చింది. అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసినవ్వుతున్నారు' అని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా మహిళలకు అండగా ఉందామని, చర్చ జరిపి నేరస్తులను శిక్షిద్దామంటే సీఎం ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత అసలు మాట్లాడేందుకు ఏమి ఉంటుందని అన్నారు. కుటుంబంలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందు ఆ విషయం ఇంట్లో వారికి చెప్పి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం ప్రకటిస్తారని ఉదహరించారు. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయొచ్చనుకుంటే కష్టమని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement