నిబంధనలు తూచ్.. మా నిర్ణయమే ఫైనల్ | house is higher than any rules, says yanamala ramakrishnudu | Sakshi
Sakshi News home page

నిబంధనలు తూచ్.. మా నిర్ణయమే ఫైనల్

Published Sat, Dec 19 2015 9:39 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

నిబంధనలు తూచ్.. మా నిర్ణయమే ఫైనల్ - Sakshi

నిబంధనలు తూచ్.. మా నిర్ణయమే ఫైనల్

అసెంబ్లీ నిబంధనల కంటే సభ పెద్దదని, అసలు నిబంధనలను రూపొందించిదే సభ కాబట్టి.. సభకు సర్వోన్నత అధికారాలు ఉంటాయని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాదిపాటు ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించినప్పుడు ఆయన మాట్లాడారు.

  • ఈ నిర్ణయం స్పీకర్‌ది కాదు, సభది
  • ఏ నిబంధననైనా అతిక్రమించేందుకు సభకు అధికారం ఉంది
  • కోర్టులకు కూడా ఇందులో జోక్యం చేసుకునే అధికారం లేదు.
  • అంటే ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు సభకు అపరిమిత అధికారాలున్నాయి
  • గతంలో బలరాంను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు
  • జేఎంఎం కేసులో అనర్హులను చేశారు
  • సభకు అన్ని హక్కులూ ఉన్నాయి. దీనిపై చర్చ అవసరం లేదు.
  • ఒకప్పుడు ఇందిరాగాంధీని కూడా సస్పెండ్ చేశారు.
  • అందువల్ల నిబంధనల కంటే సభ సుప్రీం.
  • ఇక రోజా లెజిస్లేచర్ పార్టీ ఆఫీసుకు వచ్చే విషయం స్పీకర్ గారు చెప్పాలి

అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడారు. ఎమ్మెల్యే రోజా సస్పెండైన తర్వాత అరగంట సమయం ఉన్నా, ఆమె క్షమాపణ చెప్పలేదని ఆయన అన్నారు. ఆయన ఏమన్నారంటే..

  • గతంలో నేను ఒకసారి, రెండుసార్లు మనవి చేశాను
  • అసెంబ్లీ గురించి, విశ్వసనీయత గురించి, ప్రాముఖ్యత గురించి గానీ మీరు చెప్పాల్సిన పనిలేదు
  • అలాంటి అసెంబ్లీ నిబంధనల ప్రకారం, సంప్రదాయాల ప్రకారం, బాధ్యతల ప్రకారం నడవాలి
  • ఒక సభ్యుడు వెల్‌లోకి వస్తే వాయిదా వేయాలి, లేదా సభ్యుడు తిరిగి సీట్లోకి వెళ్లేవరకు సభ నడవకూడదు
  • సంప్రదాయాలు చూస్తే, ఎజెండా పూర్తి చేయాలి.
  • రాజ్యాంగంలో నిబంధనలు చూస్తే, సభకు పూర్తి అధికారాలు ఉంటాయి
  • అసలు సీట్లోంచి నిలబడటమే అభ్యంతరకరం
  • సభా నాయకుడి ముందు నిల్చుంటున్నారు.. ఇదెంతవరకు సమంజసం
  • సభా ఆస్తుల మీదకు వస్తున్నారు.. ఇది సరికాదని చెప్పాను
  • కెమెరా ముందు ప్లకార్డులు పట్టుకుని నిలబడటం సమంజసం కాదు
  • రోజా సభ్యులకు నాయకత్వం వహిస్తూ వచ్చారు
  • ఆమె ఎవరి గురించి మాట్లాడారో అందరూ విన్నారు
  • ఇద్దరు ముగ్గురు సభ్యులు అభ్యంతరం చెప్పిన తర్వాత ఆమె వివరణ ఇచ్చి ఉంటే ఇలాంటి నిర్ణయం ఉండేది కాదు
  • సభ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించకూడదు
  • నిబంధనల ప్రకారం సస్పెండ్ అయితే అసెంబ్లీ క్వార్టర్లలో కూడా ఉండకూడదు
  • ఇక లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారు, కుదరదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement