సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సంక్షేమంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగే సాధికారత కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. చంద్రబాబుది 420 విజన్. వైఎస్ జగన్ విజన్.. ఓ విప్లవం. వచ్చే జనరేషన్ గురించి ఆలోచించే ప్రజా నాయకుడు. ప్రతి ఆడ బిడ్డను రక్షించే 'దిశ' చట్టాన్ని తెచ్చారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వైఎస్ జగన్.. ఓ క్రియేటర్. వైఎస్ జగన్ ఫేక్ సీఎం కాదు.. చంద్రబాబును షేక్ చేసిన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. నారా లోకేష్‌కు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ట్విటర్‌లో పెట్టడమే తెలుసు. సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్’ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment