సీమాంధ్ర మంత్రులు సోనియా పెంపుడు కుక్కలు
సాక్షి, చిత్తూరు: అందరికీ ఆమోదయోగ్యంగా సమన్యాయం చేస్తే విభజనకు సహకరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. కేంద్రం, రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతోందని, మరో ఐదు నెలల్లో రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని వ్యాఖ్యానించారు. ప్రతి మూడు నెలలకోసారి కుప్పం వస్తానని 2012, ఆగస్టులో వాగ్దానం చేసిన చంద్రబాబు.. సుమారు 15 నెలల తర్వాత సోమవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం గం.11.20కు బెంగళూరు నుంచి శాంతిపురం వుండలం సిద్దా
వూరు చేరుకున్న బాబు.. శాంతిపురం, రావుకుప్పం వుండలాల్లో పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇరుప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేసే రాష్ట్ర విభజనకు సహకరిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ సైతం టీడీపీ దారిలోకే వచ్చిందని, సీమాంధ్రకు న్యాయం చేస్తేనే విభజనకు అంగీకరిస్తామని స్పష్టం చేసిందన్నారు. సోనియాగాంధీకి డబ్బు పిచ్చి అని, కాంగ్రెస్ నాయకుల ద్వారా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర మంత్రులు సోనియా పెంపుడు కుక్కలని విమర్శించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పనికివూలినవాడు, ఉత్తర కువూరుడు, ఓ దద్దవ్ము కావడంతో జనం బాధపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ ఓ రొచ్చుబండగా వూరిందన్నారు. వురో ఐదు నెలల్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో యువతకు వంద ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని, టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు వూఫీ చేస్తావుని హామీ ఇచ్చారు. ఒక యూక్టర్ సావూజిక న్యాయుం అని చెప్పి పార్టీ పెట్టి తర్వాత ఏమయ్యాడనేది మీకే తెలుసని బాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 26న కుప్పం వస్తారని, తనలేఖ గురించి మాట్లాడతారని, ఆయన మోసపూరిత వూటలను నవ్మువద్దని చంద్రబాబు ప్రజలను కోరారు. జగన్‌ను చూడటానికి కూడా రావొద్దని జనానికి పదేపదే విజ్ఞప్తి చేశారు. ఆయనలా అధికార దాహం ఉంటే తాను ఎప్పుడో ప్రధానమంత్రిని అయ్యేవాడినన్నారు.