ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సిద్ధమవుతున్నారు. సోనియాను సీమాంధ్ర మంత్రులు మరి కాసేపట్లో కలిసే అవకాశం ఉన్నట్ల్ల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేలా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించే సూచనలు లేకపోవటంతో మరోమారు తమ విన్నపాన్నిఅధిష్టాన నాయకురాలికి వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు.
తెలంగాణ ఏర్పాటు నిర్ణయంతో ముందుకెళ్తున్న సంకేతాలే స్పష్టంగా వెలువడుతుండటంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు డీలా పడ్డారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో భవిష్యత్ కార్యాచరణపై గురువారం ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు.