మాచారెడ్డి, న్యూస్‌లైన్ :
ఒకవైపు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మరోవైపు సీఎం, స్పీకర్‌లు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అఖిలపక్ష కమిటీ స భ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనై నా సీమాంధ్ర నేతలు పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ బిడ్డలు ఉద్యమాలు తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు. సీ ఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైఖరికి నిరసనగా గురువా రం మాచారెడ్డి చౌరస్తాలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మాచారెడ్డి చౌరస్తాలో ని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద కామారెడ్డి-సిరిసిల్లా రహదారిపై సీఎం, స్పీకర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ కిలోమీటర మేర నిలిచిపోయాయి.
ఈసందర్భంగా టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ముస్తాక్‌హుస్సేన్, టీడీపీ అధ్యక్షుడు విష్ణుగోవర్దన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు తో ట బాల్‌రాజ్‌లు మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర సీఎం, స్పీకర్ లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బి డ్డల గోస వినకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నచందంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ కో సం ఎందరో బిడ్డలు ఆత్మత్యాగం చేసినప్పటికీ సీమాంధ్ర నేతలు స్పందించడం లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ నేతలు బైండ్ల లక్ష్మినారాయణ, అజీజ్, బాల్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, పొన్నాల వెంకట్‌రెడ్డి, భూస సురేష్, భూస శ్రీనివాస్, రమేశ్‌నాయక్, నర్సిం గ్‌రావు, సత్తయ్య, రమేశ్, హంజీనాయక్, అంబటి నారాయణ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
నందిపేట : మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద మండల జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సీఎం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రాక ముందు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి, వచ్చిన తర్వాత బిల్లును కించపరచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది తెలంగాణప్రజలను కించపరచడమేనన్నారు. ముఖ్యమంత్రి మాటలు తెలంగాణ ప్రజలపై విషం కక్కుతున్నట్లుగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను ఊరేగించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కె.గంగాధర్, రాం దాసు, ఎస్‌వి. సతీష్, గంగదాసు తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లిలో..
జక్రాన్‌పల్లి : తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి తిప్పి పంపడాన్ని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ దీకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించిన తరువాత రాష్ట్రపతికి బిల్లును తిప్పి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ీ కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రి అని అన్నారు. బిల్లును తిప్పిపంపి తెలంగాణ ప్రాంత ప్రజలను సీఎం అవమాన పరిచారన్నారు. కేంద్రం వచ్చే పార్లమెంటులో సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదింపజేయాలన్నారు.
‘తెలంగాణ’ను అడ్డుకునే కుట్ర
Published Fri, Jan 31 2014 6:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement