కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గురువారం సమావేశమైయ్యారు.
ఢిల్లీ: కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గురువారం సమావేశమైయ్యారు. రాత్రి 8గం.లకు ఆంటోని కమిటీతో సమావేశం ఉన్నందున ముందుగా చిరంజీవితో భేటీ అయ్యారు. చిరంజీవితో సమావేశమైన మంత్రులు ఆంటోని కమిటీలోవివరించే అంశాలను ప్రధానంగా చర్చిస్తున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలున్నట్లు తెలుస్తోంది. కొందరు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతుండగా, ఇంకొందరు హైదరాబాద్‌ను శాశ్వతంగా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని పట్టుబడుతున్నారు.
సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకున్న సమయంలో సీమాంధ్ర మంత్రులు ఏ అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సమైక్యమే శ్వాసగా ఉద్యమిస్తున్న సీమాంధ్రులకు సకల జనుల సమ్మె తోడవడంతో సమైక్యపోరాటం తారస్థాయికి చేరింది. మలిరోజూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. సమ్మెకు తోడుగా అడుగడుగునా సమైక్యవాదులు గురువారం కూడా నిరసనలను హోరెత్తిస్తున్నారు.