రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న సీమాంధ్ర ప్రాంత మంత్రులు మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించారు. సీమాంధ్ర మంత్రులు ఈ రోజు ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్- క్లబ్ హౌజ్‌లో సమావేశమై రాజీనామాలు స్పీకర్ ఫార్మేట్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో 13 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకు రాజీనామాలు ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రికి, స్పీకర్కు రాజీనామాలు అందజేస్తామని చెప్పారు. అధిష్టానం నిర్ణయంతో తమకు సంబంధంలేదని మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి చెప్పారు. తామంతా సాయంత్రం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు.
Published Thu, Aug 1 2013 2:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement