హైదరాబాద్లో వాటానా.. | Ponnala lakshmaiah takes on seemandhra ministers and chandra babu naidu | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో వాటానా..

Published Thu, Feb 6 2014 12:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో వాటానా.. - Sakshi

హైదరాబాద్లో వాటానా..

హైదరాబాద్లో వాటా అడగటం సీమాంధ్ర మంత్రుల వితండవాదానికి నిదర్శనమని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. అయిన తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ లో సీమాంధ్ర మంత్రులకు వాటా ఏలా ఇస్తామని ప్రశ్నించారు. గురువారం న్యూఢిల్లీలో పొన్నాల లక్ష్మయ్య విలేకర్లతో మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆయన తనదైన శైలిలో మండిపడ్డారు.

 

రాష్ట్ర విభజనకు చంద్రబాదు రెండు సార్లు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పడు ప్రజలకు సమాధానం చెప్పుకోవడం కోసం కాలుగాలిన పిల్లిలా అందరి చుట్టూ తిరుగుతున్నాడని వ్యాఖ్యానించారు. తమకు చంద్రబాబు లాంటి వాళ్ల సలహా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా  తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏలా ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని పొన్నాల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement