
డబుల్ బొనాంజా!
సెలీనా జైట్లీ గుర్తుందా? హిందీలో ‘నో ఎంట్రీ’, ‘గోల్‌మాల్ రిటర్న్స్’ తదితర చిత్రాల్లో నటించారు. పదమూడేళ్ల క్రితం మంచు విష్ణు సరసన ‘సూర్యం’ చిత్రంలో మెరిశారు. ఆరేళ్ల క్రితం పీటర్ హేగ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడారామె. పెళ్లయిన ఏడాదికి సెలీనా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే డాక్టర్ ఓ స్వీట్ న్యూస్ చెప్పారట. మళ్లీ కవలలు పుట్టబోతున్నారనే ఆ న్యూస్ విని, సెలీనా, పీటర్ సంబరపడిపోతున్నారు.