Celina Jaitley
-
నాన్న చనిపోయాడు, అప్పుడు నేను గర్భవతిని: నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మదర్స్‌డేను పురస్కరించుకుని రెండుసార్లు గర్భవతి అయిన సమయంలోని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రెండు సార్లు కవల పిల్లలను కనడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఏడు లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పినప్పుడు తన భర్త పీటర్ ముఖంలో కనిపించిన సంతోషం ఇప్పటికీ గుర్తుందని ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ లేఖను అభిమానులతో పంచుకుంది. "రెండుసార్లు కవలలకు జన్మనివ్వడం వల్ల జెస్టేషనల్ డయాబెటిస్(గర్భధారణ మధుమేహం) వచ్చింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు మా నాన్న చనిపోయారు. ఆ షాక్‌లో నేను నడిచే సామర్థ్యాన్ని కోల్పోయాను. నా భర్త పీటర్ నన్ను వీల్‌చెయిర్‌లోనే తీసుకు వెళ్లేవాడు. అప్పుడు నా ఎముకలు సైతం దెబ్బతిన్నాయి, కడుపులో బిడ్డలు తన్నేకొద్దీ శ్వాస తీసుకోవడం మరింత కష్టంగా ఉండేది. ఆ తర్వాత బేబీ షాంషర్ చనిపోవడడం, మరో బిడ్డ అర్తుజాగ్ మూడు నెలల పాటు పాటు ఇంక్యుబేటర్‌లో ఉండటం, అదే సమయంలో మా అమ్మ చనిపోవడం.. ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు మాతృత్వం ఎంత గొప్పదో అర్థమైంది. నిజానికి వీటన్నింటినీ తట్టుకునేంత సామర్థ్యం నాలో ఉందని అనుకోలేదు. ఇక మా అమ్మ మీటా జైట్లీ విషయానికి వస్తే ఆమె తన జీవితంలో ఎన్నో త్యాగాలను చేసింది. అసలు మాతృత్వానికి లింగబేధం లేదు. ఎవరైనా సరే.. పిల్లలు ఎదగడానికి అవసరమైన శక్తి, ప్రేమను ఎంత పంచుతారనేదే ముఖ్యం. నాకు అలాంటి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతగా భావిస్తున్నాను. ప్రేమ, పెంపకం, సంరక్షణ కోసం ప్రతిజ్ఞ పూనే ప్రతి ఒక్కరికీ మదర్స్ డే శుభాకాంక్షలు" అని సెలీనా జైట్లీ రాసుకొచ్చింది. చదవండి: లాక్డౌన్.. వలస కూలీల కడుపు నింపుతున్న సన్నీలియోన్ వెబ్ దునియాలో సత్తా చాటుతోన్న డ్రీమ్ గర్ల్ -
నేను ఊహించలేదు.. భావోద్యేగంతో హీరోయిన్
సెలినా జైట్లీ ‘సీజన్స్ గ్రీటింగ్స్’ చిత్రంతో మరోసారి తన అభిమాలను పలకరించనున్నారు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె 2016లో నటించిన ‘సీజన్స్ గ్రీటింగ్స్’ షార్ట్ ఫిల్మ్... లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 15న జీ5లో ప్రసారం కానుంది. కరోనా వైరస్ సంక్షోభ సమయాల్లో తన సినిమా ప్రసారంపై ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఊహించలేనంతగా జీవితంలో జరిగిన మార్పులు, సంఘటనలు వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయపూర్వక లేఖను పంచుకున్నారు. (గుంటూరు జిల్లాలో రెండో కరోనా మరణం) తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘నా సినిమా చివరి పోస్టును 2011లో పంచుకున్నాను. మళ్లీ నా తదుపరి సినిమా పోస్టును పంచుకోవడానికి ఇన్నేళ్లు పడుతుందని, అది కూడా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అని అస్సలు ఊహించలేదు. అలాగే ఒక చిన్న వైరస్ కారణంగా ప్రపంచమంతా మూసివేయ బడుతుందని కూడా. నా ప్రతి సినిమాపై ఎప్పటి లాగే వారి అభిప్రాయం చెప్పే నా తల్లిదండ్రులు సజీవంగా ఉండరని... ఇక నేను వివాహం చేసుకుని యూరప్‌లో నివసిస్తానని, నా తర్వాతి చిత్రం ఓ ముగ్గురి పిల్లలకు తల్లి అయ్యాక వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు’ అని రాసుకొచ్చారు. అలాగే భవిష్యత్తులో ఓ రోజు 377 సెక్షన్ ఎత్తివేయబడి, ఎల్జీబీటీక్యూ సాధించే జీవిత హక్కు పొందే రోజు ఒకటి వస్తుందని, ట్రాన్స్ జెండర్స్‌తో కలిసి నటించే అవకాశం నాకు దక్కుతుందనుకోలేదు అన్నారు. తన సినిమా టైటిట్‌ను ఉద్దేశిస్తూ.. “నా ప్రయాణంలోని ఈ సీజన్లలో జీవితం అనూహ్యమని నేను తెలుసుకున్నాను. మనం రేపు కోసం వేచి ఉండకుండా.. ఈ రోజును ఉత్తమంగా చూడాలి. శీతాకాలపు లోతులో వసంతకాలం వాగ్దానాన్ని చూడటం కొనసాగించాలని నిర్ణయించుకున్నాము, ఈ లాక్డౌన్లో మా చిత్రం ఖచ్చితంగా వినోదాన్ని అందిస్తుందని కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram AFTER A SUCCESSFUL STINT WORLDWIDE AT INTERNATIONAL FILM FESTIVALS ...... |**PROUDLY ANNOUNCING **| | GLOBAL PREMIERE 15 APRIL 2020 | OF OUR FILM | Seasons Greetings- A Tribute to Rituporno Ghosh | ON ZEE5 | When I was shooting my last film poster in 2011, I never imagined the the next film poster/ release will be at a time when ... - A mutant film virus would have shut down the whole world, - The fact the my parents won’t be alive to be the first to give their feedback as always. - The fact that I would be married, living in Europe, and the next poster would be shot when I would be the mother of 3 beautiful boys, - A day in future when section 377 would have been revoked and all LGBTQI in India would have attained right to life. -The fact that I would have the privilege to work with a trans actor. Through all these Seasons of my journey i have learnt that life is unpredictable and we must not wait for tomorrow and give today our best. Having decided to continue seeing the promise of spring in depth of winters We are sure our film will be exactly what you need to keep your spirits entertained in this global lockdown. So keep your glasses topped as we gear to bring the solution to keep you safely entertained in your homes. Watch world premiere of Seasons Greetings-A Tribute to Rituporno Ghosh exclusively on Zee5 15 April 2020. Thank you RamKamal and everlasting gratitude to : @ZEE5, @ZEE5Premium, @tarkat07, @_subhashchandra, @unitednations, @free.equal , @charlesradcliffe @ramkamalmukherjee, @imaritrads, @mukherjeesarbani, @sayani_palit, @jaan.kumar.sanu, @singer.kshailendra, @shreeghatak, @khanazharofficial #exclusive #breakingnews #bollywood #film #zee #zee5 #celinajaitly #celinajaitley #lillettedubey #beautyqueen #kolkata #lgbt #lockdown #pandemic #corona #staysafe #stayhome #stayhomechallenge #celina #c #filmwave #seasonsgreetings #rituparnoghosh A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on Apr 10, 2020 at 1:28am PDT -
బాలీవుడ్ నటికి పుత్రశోకం
ఇటీవల కవలలకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ఇంట విషాదం నెలకొంది. తనకు జన్మించిన ఇద్దరు పిల్లల్లో ఒకరు అనారోగ్యం కారణంగా మరణించారు. పుట్టుకతోనే తీవ్ర హృదయ సంబంధ సమస్యతో జన్మించిన బాబు, చనిపోయాడని సెలీనా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తొలి కాన్పులోనూ సెలీనా దంపతులకు కవలలే జన్మించారు. 35 ఏళ్ల సెలీనాకు తొలి కాన్పులో జన్మించిన విన్ స్టన్, విరాజ్ లకు ప్రస్తుతం ఐదేళ్లు. సెప్టెంబర్ 10న మరోసారి కవలలకు జన్మనిచ్చిన ఆనందం వారి ఇంట ఎన్నో రోజులు నిలవలేదు. వారిలో ఒక బాబును మరణించటం సెలీనా ఇంట్లో విషాదం నింపింది. -
డబుల్ బొనాంజా!
సెలీనా జైట్లీ గుర్తుందా? హిందీలో ‘నో ఎంట్రీ’, ‘గోల్మాల్ రిటర్న్స్’ తదితర చిత్రాల్లో నటించారు. పదమూడేళ్ల క్రితం మంచు విష్ణు సరసన ‘సూర్యం’ చిత్రంలో మెరిశారు. ఆరేళ్ల క్రితం పీటర్ హేగ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడారామె. పెళ్లయిన ఏడాదికి సెలీనా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే డాక్టర్ ఓ స్వీట్ న్యూస్ చెప్పారట. మళ్లీ కవలలు పుట్టబోతున్నారనే ఆ న్యూస్ విని, సెలీనా, పీటర్ సంబరపడిపోతున్నారు. -
ట్వీట్
నిత్య సంతోషంతో... శక్తిమంతంగా ఉండడమే కాదు...ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తే పనులు చేయవచ్చు. - సెలీనా జైట్లీ, బాలీవుడ్ నటి -
సెలీనా జైట్లీ నన్ను పొమ్మనలేదు!
ముంబై: బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తనను ఇంటి నుంచి వెళ్లపొమ్మనలేదని మరోనటి సన్నీ లియోన్ తాజాగా స్పష్టం చేసింది. గతంలో సెలీనాతో విభేదాలు చోటు చేసుకున్న కారణంతోనే ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చిందన్న వార్తలను సన్నీ ఖండించింది. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ఆ ఇంటితో లీజు ఒప్పందం ముగియడంతోనే ఆ ఇంటిని వదిలి వేరే ఫ్లాట్ కు వెళ్లినట్లు సన్నీ పేర్కొంది. 'నేను సెలీనా ఇళ్లు ఖాళీ చేసి సంవత్సరం పైనే అయ్యింది. ఒక సంవత్సరం నుంచి జాహూ ఫ్లాట్ లో ఉంటున్నా. అది చాలా బాగుంటుంది. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. నా లీజు ఒప్పందం ముగియడంతోనే సెలీనా ఇళ్లు ఖాళీ చేశా' అని సన్నీ తెలిపింది. ఇదిలా ఉండగా వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకునే సన్నీ ఇళ్లు ఖాళీ చేసిందని అప్పట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఆ క్రమంలోనే సన్నీ మరో ఇంటిని వెతుక్కొవడానికి చాలా ఇబ్బందులు పడిందని.. కొంత కాలం హోటళ్లనే తన ఆవాసంగా మార్చుకుని బాలీవుడ్ సినిమా ఛాన్స్ ల కోసం తిరిగిందని వార్తలు కూడా వ్యాపించాయి. -
ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్'
విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రం ‘శ్రీమతి’ తెలుగులో ‘ఎక్స్ వై జడ్’ పేరుతో విడుదల కానుంది. సెలీనా జైట్లీ, ప్రియాంక త్రివేది నాయికలు. రవి దర్శకుడు