సెలినా జైట్లీ ‘సీజన్స్ గ్రీటింగ్స్’ చిత్రంతో మరోసారి తన అభిమాలను పలకరించనున్నారు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె 2016లో నటించిన ‘సీజన్స్ గ్రీటింగ్స్’ షార్ట్ ఫిల్మ్... లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 15న జీ5లో ప్రసారం కానుంది. కరోనా వైరస్ సంక్షోభ సమయాల్లో తన సినిమా ప్రసారంపై ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఊహించలేనంతగా జీవితంలో జరిగిన మార్పులు, సంఘటనలు వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయపూర్వక లేఖను పంచుకున్నారు. (గుంటూరు జిల్లాలో రెండో కరోనా మరణం)
తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘నా సినిమా చివరి పోస్టును 2011లో పంచుకున్నాను. మళ్లీ నా తదుపరి సినిమా పోస్టును పంచుకోవడానికి ఇన్నేళ్లు పడుతుందని, అది కూడా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అని అస్సలు ఊహించలేదు. అలాగే ఒక చిన్న వైరస్ కారణంగా ప్రపంచమంతా మూసివేయ బడుతుందని కూడా. నా ప్రతి సినిమాపై ఎప్పటి లాగే వారి అభిప్రాయం చెప్పే నా తల్లిదండ్రులు సజీవంగా ఉండరని... ఇక నేను వివాహం చేసుకుని యూరప్‌లో నివసిస్తానని, నా తర్వాతి చిత్రం ఓ ముగ్గురి పిల్లలకు తల్లి అయ్యాక వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు’ అని రాసుకొచ్చారు.
అలాగే భవిష్యత్తులో ఓ రోజు 377 సెక్షన్ ఎత్తివేయబడి, ఎల్‌జీబీటీక్యూ సాధించే జీవిత హక్కు పొందే రోజు ఒకటి వస్తుందని, ట్రాన్స్ జెండర్స్‌తో కలిసి నటించే అవకాశం నాకు దక్కుతుందనుకోలేదు అన్నారు. తన సినిమా టైటిట్‌ను ఉద్దేశిస్తూ.. “నా ప్రయాణంలోని ఈ సీజన్లలో జీవితం అనూహ్యమని నేను తెలుసుకున్నాను. మనం రేపు కోసం వేచి ఉండకుండా.. ఈ రోజును ఉత్తమంగా చూడాలి. శీతాకాలపు లోతులో వసంతకాలం వాగ్దానాన్ని చూడటం కొనసాగించాలని నిర్ణయించుకున్నాము, ఈ లాక్‌డౌన్‌లో మా చిత్రం ఖచ్చితంగా వినోదాన్ని అందిస్తుందని కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment