
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మదర్స్‌డేను పురస్కరించుకుని రెండుసార్లు గర్భవతి అయిన సమయంలోని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రెండు సార్లు కవల పిల్లలను కనడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఏడు లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పినప్పుడు తన భర్త పీటర్ ముఖంలో కనిపించిన సంతోషం ఇప్పటికీ గుర్తుందని ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ లేఖను అభిమానులతో పంచుకుంది.
"రెండుసార్లు కవలలకు జన్మనివ్వడం వల్ల జెస్టేషనల్ డయాబెటిస్(గర్భధారణ మధుమేహం) వచ్చింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు మా నాన్న చనిపోయారు. ఆ షాక్‌లో నేను నడిచే సామర్థ్యాన్ని కోల్పోయాను. నా భర్త పీటర్ నన్ను వీల్‌చెయిర్‌లోనే తీసుకు వెళ్లేవాడు. అప్పుడు నా ఎముకలు సైతం దెబ్బతిన్నాయి, కడుపులో బిడ్డలు తన్నేకొద్దీ శ్వాస తీసుకోవడం మరింత కష్టంగా ఉండేది. ఆ తర్వాత బేబీ షాంషర్ చనిపోవడడం, మరో బిడ్డ అర్తుజాగ్ మూడు నెలల పాటు పాటు ఇంక్యుబేటర్‌లో ఉండటం, అదే సమయంలో మా అమ్మ చనిపోవడం.. ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు మాతృత్వం ఎంత గొప్పదో అర్థమైంది. నిజానికి వీటన్నింటినీ తట్టుకునేంత సామర్థ్యం నాలో ఉందని అనుకోలేదు. ఇక మా అమ్మ మీటా జైట్లీ విషయానికి వస్తే ఆమె తన జీవితంలో ఎన్నో త్యాగాలను చేసింది. అసలు మాతృత్వానికి లింగబేధం లేదు. ఎవరైనా సరే.. పిల్లలు ఎదగడానికి అవసరమైన శక్తి, ప్రేమను ఎంత పంచుతారనేదే ముఖ్యం. నాకు అలాంటి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతగా భావిస్తున్నాను. ప్రేమ, పెంపకం, సంరక్షణ కోసం ప్రతిజ్ఞ పూనే ప్రతి ఒక్కరికీ మదర్స్ డే శుభాకాంక్షలు" అని సెలీనా జైట్లీ రాసుకొచ్చింది.
చదవండి: లాక్‌డౌన్.. వలస కూలీల కడుపు నింపుతున్న సన్నీలియోన్
Comments
Please login to add a commentAdd a comment