నో ఎంట్రీ @ ఏపీ సెక్రటేరియట్ | no entry boards at ap secretariat main gate | Sakshi
Sakshi News home page

నో ఎంట్రీ @ ఏపీ సెక్రటేరియట్

Published Wed, Jun 17 2015 4:36 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM

నో ఎంట్రీ @ ఏపీ సెక్రటేరియట్ - Sakshi

నో ఎంట్రీ @ ఏపీ సెక్రటేరియట్

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో పలు కీలక పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. బుధవారం నుంచి సచివాలయం ప్రధాన ద్వారం వద్ద రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. కనీసం సచివాలయం ఉద్యోగులను కూడా అనుమతించడంలేదు. ఉద్యోగులు, సందర్శకులు లుంబినీ పార్కువైపు ఉన్న ద్వారం గుండా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.  

ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా సెక్రటేరియట్ లో పలువురు మంత్రులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ( ఆరున్నర గంటపాటు) ఏపీ క్యాబినెట్ సుదీర్ఘంగా  సమావేశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement