main gate
-
నో ఎంట్రీ @ ఏపీ సెక్రటేరియట్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో పలు కీలక పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. బుధవారం నుంచి సచివాలయం ప్రధాన ద్వారం వద్ద రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. కనీసం సచివాలయం ఉద్యోగులను కూడా అనుమతించడంలేదు. ఉద్యోగులు, సందర్శకులు లుంబినీ పార్కువైపు ఉన్న ద్వారం గుండా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా సెక్రటేరియట్ లో పలువురు మంత్రులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ( ఆరున్నర గంటపాటు) ఏపీ క్యాబినెట్ సుదీర్ఘంగా సమావేశమైంది. -
కౌబాయ్ కల్చర్ డోర్స్
పదిలంగా అల్లుకున్న పొదరింటికైనా.. అదిరిపోయే మేడకైనా.. అందంతో పాటు రక్షణ కల్పించేది ప్రధాన ద్వారాలే. సింహద్వారానికి ఎంట్రెన్స్ చూపించే మెయిన్ గేట్‌కు ఉన్న ఇంపార్టెన్స్ అంతాఇంతా కాదు. అందుకే సిరిగలవారు ఇన్నోవేటివ్ గేట్లతో తమ ఇంటికి మరింత అందాన్ని తీసుకొస్తున్నారు. అందుకే రాజమహళ్లకు కాపుకాసే మహాద్వారాలను తలదన్నే రేంజ్లో నయా జమానా గేట్లు దర్శనమిస్తున్నాయి. అద్దాలతో మెరిసేవి.. కౌబాయ్ కల్చర్‌ను గుర్తు చేసేవి.. ఉడెన్‌తో తీర్చిదిద్దినవి.. ఇలా రకరకాల గేట్లు స్వాగతం పలుకుతున్నాయి. నగరంలో జూబ్లీహిల్స్,బ ంజారాహిల్స్లో వెలసిన ఖరీదైన బంగ్లాల ముందున్న గేట్లు ఎలా ఉన్నాయో చూడండి. ఫొటోలు: దయాకర్ -
చంచల్‌గూడ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు
-
చంచల్‌గూడ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చంచల్‌గూడ జైలులో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో జైలు ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా ఎక్కడికక్కడ ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ దీక్ష బుధవారం నాటికి నాలుగోరోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండేలా వైద్యులను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే నిర్బంధంలో ఉన్న జనం కోసం దీక్ష చేపట్టిన జగన్‌కు అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపేందుకు ఆయన అభిమానులు నిత్యం వేలాది మంది చంచల్‌గూడ జైలుకు తరలివస్తున్నారు. అయితే వారిని పోలీసులు జైలు సమీపంలోకి రానివ్వకపోవడంతో వారు నిరాశతో వెనతిరుగుతున్నారు.