
జూన్ 22 నుంచి నో ఎంట్రీ
మైసూరు : మైసూరు యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ వివాహం సందర్భంగా జూన్ 22 నుంచి 28వరకు మైసూరు ప్యాలెస్‌లో సామాన్యులకు ప్రవేశాన్ని నిషేధించారు. ఈ మేరకు ప్యాలెస్ పాలక మండలి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 27న రాజస్థాన్‌కు చెందిన త్రిషికా కుమారితో మైసూరు యువరాజుకు వివాహం జరగనుంది. అందులో భాగంగా 22 నుంచే ప్యాలెస్‌లో వేడుకలు మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ప్రవేశం నిషేధించాల్సిందిగా రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ సూచించడంతో పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.