సమిశ్రగూడెం పురాతన వంతెన
నిడదవోలు : మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటీష్ హయాంలో 1932లో నిర్మించిన పురాతన వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భారీ వామనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆర్‌అండ్‌బీ ఏఈ డి.నందకిశోర్ తెలిపారు. భారీ లోడు వాహనాలు వెళ్తే వంతెన కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని ఇటీవల హైదారాబాద్ నుంచి స్రైయోరంట్ సంస్థకు చెందిన నలుగురు బృదం సభ్యులు నివేదికలు అందించారు. నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆర్‌అంబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. పురాతన వంతెనపై 10 టన్నులకు మించి లోడు వాహనాలను పూర్తిగా నిషేధించారు. వంతెనపై గంటకు 15 కిలోమీటర్లకు మించి ఎటువంటి వాహనాలు వెళ్లరాదని హెచ్చరించారు. వంతెన ముఖద్వారంలో 10 అడుగుల దూరంలో ఐరన్ గడ్డర్( స్టాపర్)ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా నిడదవోలు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ముఖద్వారంలో ఐరన్ స్టాపర్లను ఏర్పాటు చేయనున్నారు.
వాహనాల దారి మళ్లింపు ఇలా...
నిడదవోలు మండలం సమిశ్రగూడెం వంతెన వద్ద ఇరుకు, భారీ వాహనాలు నిషేధించడంతో పాటు బరువు 10 టన్నులు, వేగ పరిమితి గంటకు 15 కిలోమీటర్లు మాత్రమేనని హెచ్చరిక బోర్డులను ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా కొవ్వూరు మండలం పంగిడి, తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు జంక్షన్‌లో నిడదవోలు వైపుగా భారీ వాహనాలు రాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాజమండ్రి, కొవ్వూరు నుంచి తాడేపల్లిగూడెం వైపుగా వెళ్లే వాహనాలు సమిశ్రగూడెం వంతెన ఎడమ వైపు నుంచి డి,ముప్పవరం, కానూరు, పెరవలి, తణుకు మీదుగా మళ్లిస్తారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రికి వెళ్లాల్సిన భారీ వాహనాలు ప్రత్తిపాడు నుంచి తణుకు, రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకోవచ్చును.
Comments
Please login to add a commentAdd a comment