‘జిరాక్స్‌ తీసుకుని.. అక్కడే ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు’ | Guntur Woman Jyothi Death Case Police Interrogation Based On CCTV Records | Sakshi
Sakshi News home page

జ్యోతి హత్యకేసులో పురోగతి

Published Tue, Feb 12 2019 5:36 PM | Last Updated on Tue, Feb 12 2019 8:35 PM

Guntur Woman Jyothi Death Case Police Interrogation Based On CCTV Records - Sakshi

సాక్షి,  గుంటూరు : అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా..  శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అంబేద్కర్‌ సెంటర్‌లోని ఓ జిరాక్స్‌ సెంటర్‌లో పేపర్లు జిరాక్స్‌ తీసుకున్న జ్యోతి.. అనంతరం శ్రీనివాస్‌ బైకు మీద వెళ్లినట్లుగా గుర్తించారు. నవులూరు వెళ్లే రోడ్డులో ఈ జంట ఫ్రైడ్‌ రైస్‌ తిన్నట్లుగా సీసీటీవీలో రికార్డు అయింది. అయితే ఆ తర్వాత వారి బైక్‌ వెనుక ఎవరైనా ఫాలో అయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. (రాజధానిలో ప్రేమజంటపై దాడి)

కాగా జ్యోతి మృతిపై తమకు అనుమానాలు ఉన్నట్లు ఆమె సోదరుడు ప్రభాకర్‌ మీడియాతో పేర్కొన్నాడు. ఈ ఘటనలో..  ‘శ్రీనివాస్‌కు చాలా చిన్న దెబ్బలే తగిలాయి. కానీ జ్యోతి మాత్రం చనిపోయింది. వీటన్నింటిని చూస్తుంటే పథకం ప్రకారమే దాడి జరిగినట్లు అనిపిస్తుంది. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ జరపాలి’ అని ప్రభాకర్‌ కోరాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న శ్రీనివాస్‌ను కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement