
చికిత్స పొందుతున్న గుణశేఖర్, రహమత్‌బీ
ఉరవకొండ: తమ ప్రేమను పెద్దలు నిరాకరిస్తారనే భయంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరు మండలం చిన్న ప్యాపిలికి చెందిన గుణశేఖర్ ఉరవకొండలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో డీజిల్ మెకానిక్ కోర్సు చేస్తున్నాడు. పెద్దప్యాపిలికి చెందిన రహమత్‌బీ అక్కడే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఉరవకొండలోని సీపీఎం కార్యాలయం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి ప్రాణానికి ఎటువంటి ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.